Friday, September 20, 2024

‘మత్తు వదలారా 2’ నుంచి ఫరియా అబ్దుల్లా ఫస్ట్ లుక్

శ్రీ సింహ కోడూరి, సత్య లీడ్ రోల్స్ లో రితేష్ రానా దర్శకత్వంలో వచ్చిన సెన్సేషనల్ హిట్‌ మూవీ ‘మత్తు వదలరా’. ఇప్పుడు అదే క్రియేటివ్ టీమ్ సీక్వెల్‌ ‘మత్తు వదలారా 2’ తో ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అయ్యారు. ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్ గా రిలీజైన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

‘మత్తు వదలారా2’ లో హీరోయిన్ ఫారియా అబ్దుల్లా నిధి పాత్రలో కనిపించనున్నారు. ఈ రోజు మేకర్స్ ఫరియా అబ్దుల్లా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. గన్ పట్టుకొని ఇంటెన్స్ లుక్ లో చూస్తున్న ఫారియా యాక్షన్ పోస్టర్ అదిరిపోయింది.

Faria Abdullah first look from Mattu Vadalara2

ఈ చిత్రంలో సునీల్, వెన్నెల కిషోర్, అజయ్, రోహిణి, రాజా చెంబోలు, ఝాన్సీ, శ్రీనివాస్ రెడ్డి, గుండు సుదర్శన్ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రతి పాత్ర కీలకంగా ఉండబోతోంది. ప్రముఖ నటులు చేరడంతో ఎంటర్ టైన్మెంట్ నెక్స్ట్ లెవల్ లో వుండబోతోంది. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందిస్తుండగా, సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

Lavanya Tripati New Pics

Ishita Raj Insta Hd Pics

Nabha Natash New photos