- కిషన్ రెడ్డి, కెటిఆర్‌లు, ప్రభుత్యానికి క్షమాపణలు
- చెప్పడానికి సిద్ధంగా ఉండాలి
- టిపిసిసి అధికార ప్రతినిధి చనగాని దయాకర్
ఆగష్టు 15వ తేదీ వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని అప్పుడు కిషన్ రెడ్డి, కెటిఆర్‌లు, ప్రభుత్యానికి క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఉండాలని టిపిసిసి అధికార ప్రతినిధి చనగాని దయాకర్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ చేయడానికి ముఖ్యమంత్రి కసరత్తు చేస్తున్నారని,
ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉందని తెలిసి కూడా పదే, పదే రుణమాఫీ గురించి, ధాన్యం కొనుగుళ్ల గురించి బిజెపి, బిఆర్‌ఎస్‌లు రాద్దాంతం చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పక్షపాతిఅని ఆయన అన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో బిజెపి, బిఆర్‌ఎస్‌లకు ఓటు అడిగే నైతిక హక్కులేదన్నారు. నిరుద్యోగుల ఉసురు వల్లే బిఆర్‌ఎస్ పార్టీ ఆగమయ్యిందన్నారు. త్వరలో తెలంగాణలో రైతు రాజ్యానికి పునాది పడుతుందన్నారు.