Thursday, April 17, 2025

పెరులో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు

  • పెరులో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు
  • 26 మంది మృతి- 14 మందికి గాయాలు

పెరూలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రయాణీకుల బస్సు పెద్ద లోయలో పడింది. ఈ ప్రమాద ఘటనలో మొత్తం 26 మంది చనిపోగా.. మరో 14 మంది గాయపడ్డారు. అమెరికా స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్పారు. పెరూ రాజధాని లిమా నుంచి మొత్తం 40 మంది ప్రయాణికులతో బస్సు ఆండియన్‌ కు బయలుదేరింది. కాసేపటి తరువాత బస్సు అదుపు తప్పి 200 మీటర్ల లోతులో ఉన్న భారీ లోయలోకి దూసుకెళ్లిందని బస్సులో ప్రయాణిస్తూ గాయపడిన వారు చెప్పారు.

బస్సు ప్రమాదానికి సంబందించిన సమాచారం అందిన వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ముందు గాయపడ్డ ఇద్దరు బస్సు డ్రైవర్లతో పాటు ప్రయాణీకులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఘాట్ రోడ్లు, అతి వేగం, అద్వాన్నమైన రోడ్డు, ట్రాఫిక్‌ సిగ్నల్స్ లేకపోవడం వంటి కారణాల వల్ల పెరూలో తరుచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. గత సంవత్సరం పెరూలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 3,100 మంది చనిపోయారని అధికారులు చెప్పారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com