Wednesday, April 9, 2025

నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

నల్లగొండ జిల్లాలో ఆగి ఉన్న బొలెరో కారును డీసీఎం ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దేవరకొండకు చెందిన యాది(22), రిజ్వాన్(36) అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న బొలెరో కారును డీసీఎం ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా .. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

తీవ్రంగా గాయపడిన వ్యక్తిని దగ్గరలో ఉన్న మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన దామరచర్ల మండలం బోత్తులపాలెం దగ్గర జరిగింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతులు దేవరకొండ ప్రాంతానికి చెందిన యాది (22), రిజ్వాన్ (36)గా గుర్తించారు. నలుగురు కార్మికులు కేబుల్ పనులు చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తునట్లు వెల్లడించారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com