పాల ట్యాంకర్‌ను ఢీకొన్న ప్రైవేట్ బస్సు
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉన్నావ్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై స్లీపర్ బస్సు, పాల ట్యాంకర్‌ను ఢీకొనడంతో 18 మంది మృతి చెందగా, 19 మందికి గాయా లైనట్లు పోలీసులు తెలిపారు. ఉన్నావ్ జిల్లా బంగార్‌మౌ ప్రాంతంలోని జోజికోట్ గ్రామ సపంలోని బెహతా ముజావర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని, వారి పరిస్థితి నిలకడగా ఉందని పోలీ సులు చెప్పారు.పోలీసులు తెలిపిన వివ రాల ప్రకారం..
తెల్లవారుజామున 5.15 గంటలకు బీహార్ నుంచి ఢిల్లీ వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు పాల ట్యాంకర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులందరినీ బయటకు తీసి చికిత్స నిమిత్తం సిహెచ్‌సి బంగార్మావుకు తరలి ంచారు. కాగా, ప్రాథమిక విచా రణలో బస్సు అతివేగంగా దూసుకు రావడంతో ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించి మృతుల కుటుంబాలకు సాను భూతి తెలిపారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.