Sunday, April 6, 2025

బట్టతల ఉంది, పెళ్లి కావడం లేదు అందుకే సచ్చిపోతున్నా.

పెళ్లి కావడం లేదన్న మనస్తాపంతో ఓ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్దాడు. ఈ ఘటన హైదరాబాద్ లోచోటుచేసుకుంది. పురోహిత్‌ కిషోర్‌(34) అనే వైద్యుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సికింద్రాబాద్‌ జీఆర్పీ ఎస్సై రమేష్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. గుజరాత్ కు చెందిన ప్రకాష్‌మాల్‌కు ఇద్దరు కుమారులుండగా… చిన్న కుమారుడు పురోహిత్‌ కిషోర్‌ ఎంబీబీఎస్‌ డాక్టర్‌గా అల్వాల్‌ లోని ఓ బస్తీ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. కిషోర్ కు కొన్ని నెలల కిందట ఓ అమ్మాయితో ఎంగేజ్ మెంట్ అయింది. అయితే కిషోర్‌ కు బట్టతల ఉందన్న కారణంతో ఆ సంబంధం కాన్సిల్ అయింది. ఆ తరువాత చాలా పెళ్ల సంబంధాలు వచ్చిన అవి సెట్ కాకపోవడంతో మనస్తాపం చెందిన కిషోర్ చనిపోయేందకు నిర్ణయించుకున్నాడు. బట్టతల కారణంగా పెండ్లి కావడం లేదని భావించి సూసైడ్‌ చేసుకున్నాడు.

బొల్లారం రైల్వేస్టేషన్‌ వద్ద
బుధవారం ఉదయం తన బైక్ పై వెళ్లి బొల్లారం రైల్వేస్టేషన్‌ వద్ద అక్కడ తన బైక్ ను పార్క్ చేసి ఆ తరువాత సమీపంలోని క్యావలరీ బ్యారక్‌ రైల్వేస్టేషన్‌ ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ నిజామాబాద్‌ నుంచి సికింద్రాబాద్‌కు వస్తున్న హుజూర్‌ సాహిబ్‌ నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రైలు లోకోపైలెట్‌ ఈ విషయాన్ని గుర్తించి జీఆర్పీ పోలీసులకు సమాచారాన్ని అందించాడు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని..అతని గుర్తింపు కార్డు అడ్రస్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. అనంతరం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. గురువారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. స్థానికంగా ఈ ఘటన కలకం సృష్టించింది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com