Monday, November 18, 2024

గెలుస్తారని బీఆర్ఎస్​కు కోట్లు ఇచ్చారు

నలుగురి నుంచే రూ. 40 కోట్లు
గుర్తు తెలియని దాతలు ఇచ్చినవి రూ. 153 కోట్లు

బీఆర్ఎస్​ గెలుస్తుంది.. తమకేదో చేస్తుందనే ఆశలతో గతేడాది కోట్లకు కోట్ల విరాళాలు వచ్చాయి. బీఆర్​ఎస్​ ఖాతాలో ఇప్పుడు మొత్తం రూ. 1148 కోట్లున్నాయి. 2023లో గులాబీ పార్టీకి వచ్చిన విరాళం రూ. 683 కోట్లు ఉంటే.. ఇందులో ఎలక్ట్రోరల్​ బాండ్ల ద్వారా రూ. 529 కోట్లు సమకూరాయి. ఇక వ్యక్తిగతంగా ఇచ్చిన రుణాలు రూ. 154 కోట్లు. ఇందులో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి తన కంపెనీ రాజపుష్ప పేరుతో రూ. 10 కోట్లు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్​ వదిన నిర్వహిస్తున్న హన్స పవర్​ అండ్​ ఇన్​ఫ్రా ద్వార రూ. 10 కోట్లు వచ్చాయి. ఈ నలుగురి వాటా రూ. 40 కోట్లుగా ఉంది. ఇక, మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా రూ. 5కోట్లు పార్టీకి విరాళం ఇచ్చారు. రోహిణి మినరల్స్​రూ. 5 కోట్లు, మల్లిఖార్జున హాస్పిటల్స్​ రూ. 2.95 కోట్లు ఇచ్చారు. మొత్తం విరాళాల్లో రూ. 153 కోట్లు ఎవరు ఇచ్చారో లెక్క లేదు.

ఎవరు ఇచ్చారో
రాజకీయ పార్టీలకు విరాళాలే ప్రధాన ఆర్ధిక వనరు. పార్టీని అభిమానించే వారు, కార్పొరేట్ సంస్థలు, కార్యకర్తలు ఇచ్చే విరాళాల లెక్కలు మొన్నటి వరకు కాస్త పారదర్శకంగా ఉండేవి. కానీ ఇప్పుడు పొలిటికల్ పార్టీలకు.. గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థల నుంచి కోట్లకు కోట్లు వచ్చి పడుతున్నాయి. అవి ఎవరు ఇస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయనేది ఎవరికి తెలియదు. తెలంగాణలోని బీఆర్​ఎస్​‌కు 2021–22 ఆర్థిక సంవత్సరంలో గుప్త విరాళాలు 153 కోట్లు వచ్చినట్లు అసోసియేషన్​ ఫర్​ డెమొక్రటిక్​ రీఫార్మ్స్​ రిపోర్టులో తేలింది. అన్ నోన్​ సోర్సెస్​ నుంచి అధిక విరాళాలు వచ్చిన పార్టీగా బీఆర్​ఎస్​ మూడో స్థానంలో నిలిచింది. 2021–22లో ఆ పార్టీకి 218 కోట్ల విరాళాలు రాగా.. అందులో 153 కోట్లు గుప్త విరాళాలేనని వెల్లడించింది. అంటే.. పార్టీకి వచ్చిన మొత్తం విరాళాల్లో గుర్తు లియని వ్యక్తులు, సంస్థల నుంచి వచ్చినవే 70 శాతం. కాగా, అన్​నోన్​ సోర్సెస్​ నుంచి అధిక ఆదాయం వచ్చిన పార్టీల జాబితాలో తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకే మొదటి స్థానంలో ఉంది. ఆ పార్టీకి 306 కోట్లు గుప్త విరాళాల రూపంలోనే వచ్చాయి. ఆ తర్వాత 291 కోట్ల గుప్త విరాళాలతో ఒడిశాలోని అధికార పార్టీ బీజేడీ రెండో స్థానంలో నిలిచింది. 60 కోట్ల అన్​నోన్​ సోర్సెస్​ విరాళాలతో ఏపీలోని అధికార పార్టీ వైఎస్సార్​సీపీ నాలుగో స్థానంలో ఉంది.

నిరుడు రూ. 683 కోట్లు
2023లో ఎన్నికలకు ముందు బీఆర్ఎస్​కు రూ. 683 కోట్లు వచ్చి చేరాయి. ఇందులో బాండ్ల ద్వారా రూ. 529 కోట్లు వస్తే.. వ్యక్తిగతంగా రూ. 154 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు విరాళాలు ఇచ్చిన వారి జాబితా కాంగ్రెస్​ పెద్దలకు చేరింది. ఎందుకు, ఎంత మేరకు ఇచ్చారనే విషయాలపై కూపీ లాగుతున్నారు.

విరాళాలు ఇచ్చిన ముఖ్యులు :
గంగుల కమలాకర్ రూ. 10 కోట్లు
గాయత్రీ గ్రానైట్స్ రూ. 10 కోట్లు
హన్స్ పవర్ కంపెనీ రూ. 10 కోట్లు
రాజపుష్ప ప్రాపర్టీస్ రూ. 10 కోట్లు
చామకూర మల్లారెడ్డి రూ. 5 కోట్లు

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular