Sunday, September 29, 2024

పోలీసులు, మావోయిస్టుల మధ్య ఆధిపత్య పోరు

  • బలవుతున్న అమాయకులు
  • తెలంగాణ, ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో భయానక వాతావరణం

పోలీసులు, మావోల ఆధిపత్య పోరులో అమాయక గిరిజనులు, ప్రజలు బలవుతున్నారు. ఛత్తీస్ గఢ్, తెలంగాణ సరిహద్దులో భయానక వాతావరణం కొనసాగుతోంది. ఛత్తీస్ గఢ్ దండకారణ్యంలో వరుస ఎన్ కౌంటర్లతో అడవి దద్దరిల్లుతుంది. ఐదు నెలల నుంచి వరుస ఎన్‌కౌంటర్లు జరుగుతుండడంతో మావోయిస్టు పార్టీ నేతలు ప్రతి ఎన్ కౌంటర్‌లో పదుల సంఖ్యలో చనిపోతున్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేతలో పోలీసులు పైచేయి సాధిస్తున్నారని చెప్పవచ్చు. ఛత్తీస్ గఢ్ అభయారణ్యాన్ని పోలీసులు చుట్టుముట్టి భారీ క్యాంపులను ఏర్పాటు చేసుకున్నారు.

పోలీసులు అడవుల్లోకి రాకుండా వారి వ్యూహాలను దెబ్బతీయడమే లక్ష్యంగా మావోయిస్టులు ఆడవుల చుట్టూ, అడవిలో క్లైమర్ మైన్స్, ప్రెజర్ బాంబులు అమరుస్తున్నారు. ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన తెలంగాణ, ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో భయానక వాతావరణం నెలకొంది. ఈ సంవత్సరం జనవరి నుండి సాగుతున్న కగార్ పేరుతో మావోయిస్టు ఏరివేత ఆపరేషన్ లో సుమారు 150 మంది మావోయిస్టులు చనిపోయారు. ప్రతీకారంతో రగిలిపోతున్న మావోయిస్టులు పోలీసులే లక్ష్యంగా కొంగల, కర్రెగుట్ట అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు క్లైమెర్ మైన్స్, ప్రెజర్ బాంబులు అమరుస్తున్నారు. పోలీసుల లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన బాంబులు పేలి అమాయక ప్రజలు చనిపోతున్నారు. కొంగల, కర్రెగుట్ట ప్రాంత అడవులు ఛత్తీస్ గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో విస్తరించి ఉన్నాయి. రెండు రాష్ట్రాలకు చెందిన గిరిజనులు, ప్రజలు వివిధ పనుల కోసం అడవుల నుండి అటు ఇటు వచ్చి వెళ్తుంటారు.

కొందరు వంట చెరుకు కోసం మరికొందరు అటవీ ఉత్పత్తుల కోసం అడవిలోకి వెళ్తారు. అయితే పోలీసులు లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన బాంబులు పేలి అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. జూన్ 3వ తేదీన కొంగల అటవీ ప్రాంతంలో వంట చెరుకు కోసం ఇల్లందుల ఏసు అనే వ్యక్తి వెళ్ళాడు. వంటచెరుకు సేకరిస్తున్న క్రమంలో ప్రెజర్ బాంబు పేలి మృతి చెందాడు. దీంతో మావోయిస్టు పార్టీ వెంటనే స్పందించి ఓ లేఖ విడుదల చేసింది. గిరిజనులు, గిరిజనేతరు లు కొంగాల, కర్రెగుట్ట అటవీ ప్రాంతాల్లోకి రావద్దని పోలీసుల లక్ష్యంగా బాంబులను అమర్చడం జరిగిందని మావోయిస్టులు లేఖ లో పేర్కొన్నా రు. దీంతో ప్రజలు అటవీ ప్రాంతాల్లోకి వెళ్లడానికి జంకుతున్నారు.

కానీ వీరి జీవనమే అడవిలో కాబట్టి వెళ్ళాక తప్పడం లేదు. ఏసు మృతి మరువకముందే ఈనెల 13వ తేదీన కర్రెగుట్ట అడవిలోని బెదంగుట్ట సమీపంలో ఉన్న శివాలయం దర్శనానికి వెళ్తున్న సునీతా అనే మహిళ మావోయిస్టులు అమర్చిన బాంబు పేలి తీవ్రంగా గాయం కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సునీత కాలును తొలగించాల్సి వచ్చింది. దీంతో అటవీ ప్రాంతం చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజల ఎక్కడ ఏ బాంబు ఉంటుందో అవి పేలి ఎవరి ప్రాణాలు పోతాయో అనే భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. వంట చెరుకు కోసం అడవిలోకి వెళ్లిన యేసు మృతిని నిరసిస్తూ వెంకటాపురం మండలానికి చెందిన పలు గ్రామాల ప్రజలు మావోయిస్టులకు వ్యతిరేకంగా జగనాధపురంలో భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. అధిపత్యం కోసం అమాయక ప్రజలు ప్రాణా లు కోల్పోవాల్సి వస్తుందని నినాదాలు చేశారు.

ప్రజల నిరసనతో మావోయిస్టులు కంగుతిన్నారు. ములుగు జిల్లా ఎస్‌పి పేరుతో మావోయిస్టుల కు వ్యతిరేకంగా లేఖ విడుదల చేశారు. అడవుల్లోకి ప్రజలు, పోలీసులు రాకుండా టార్గెట్ చేసి బాంబులు అమర్చారని, మావోయిస్టులు అమాయ క ప్రజలను పొట్టన పెట్టుకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు. అయితే ఎవరి ఆధిపత్యం కోసం వారు కాల్పులు జరుపుకోవడం, లేఖలు విడుదల చేసుకోవడం జరుగుతుంది. ఇటు మావోయిస్టు, అటు పోలీసుల పోరులో అభం శుభం తెలియని అడవులను నమ్ముకొని జీవిస్తున్న అమాయక ప్రజలు బలవుతున్నారు. పది రోజుల వ్యవధిలోనే రెండు ఘటనలు జరిగాయి. ఒకరు చనిపోగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కర్రెగుట్ట, కొంగాల అటవీ ప్రాంతాల చుట్టుపక్కల ఉన్న ప్రజలు భయంతో బిక్కుబిక్కుమని గడపాల్సిన దైన్యస్థితి నెలకొంది. ఈ ఆధిపత్య పోరు ఇక్కడతోనే అగుతుందా లేక కొనసాగుతున్న అనే భయాందోళనలో అటవీ ప్రాంత చుట్టుపక్కల ప్రజలు గిరిజనులున్నారు.

భారీగా మావోయిస్టులు ఆయుధాల డంప్ స్వాదీనం
చర్ల మండల సరిహద్దు ఒడిశాఎపి సరిహద్దు బెజంగివాడ రిజర్వ్ ఫారెస్టులో ఒక పర్వత కుహూరంలో మావోయిస్టులు దాచిన ఆయుధాల డంప్‌ను శుక్రవారం భద్రతా బలగాలు స్వాదీనం చేసుకున్నారు. దూలగండి గ్రామ సమీపంలో మావోయిస్టుల డంప్ నుంచి ఎస్బిఎంఎల్ గన్స్, బారేల్, ఎలక్ట్రిక్ డిటోనేటర్స్, జిలెటిన్ స్టిక్స్, డైరెక్షనల్ మైన్, సోలార్ ప్లేట్, వైర్, ఎల్పీజి సిలిండర్స్, స్విచులు, మెడిసిన్స్ భద్రతా బలగాలు స్వాదీనం చేసుకున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular