Saturday, November 16, 2024

అసదుద్దీన్, నా మధ్య ఫైట్ కంటిన్యూ అవుతుంది ఫిరోజ్‌ఖాన్

  • హైదరాబాద్ ఎంపి ఎన్నికల్లో పార్టీ ఆదేశాలను శిరసావహిస్తా
  • కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్‌ఖాన్

హైదరాబాద్ ఎంపి స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించకపోవడంపై కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్‌ఖాన్ స్పందించారు. ఎంఐఎం, కాంగ్రెస్‌ల మధ్య హైదరాబాద్ ఎంపి స్థానం విషయంలో లోపాయికారి ఒప్పందం జరిగినా, ఆ ఒప్పందం విషయంలో హైకమాండ్ నుంచి ఎలాంటి ఆదేశాలు అందినా ఆ ఆదేశాలు పాటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఫిరోజ్‌ఖాన్ తెలిపారు. ఈ ఎన్నికలను పక్కనపెడితే చాలాఏళ్లుగా తనకు, అసదుద్దీన్‌కు మధ్య ఉన్న ఫైట్ కంటిన్యూ అవుతుందని, కాకపోతే ఎంపి ఎన్నికల్లో తమ పార్టీ సూచించిన విధంగా పనిచేస్తానని ఫిరోజ్‌ఖాన్ అన్నారు.

కాగా, హైదరాబాద్ పార్లమెంట్ బరిలో బిజెపి నుంచి విరించి హాస్పిటల్ అధినేత్రి మాధవీలత బరిలోకి దిగుతుండగా బిఆర్‌ఎస్ నుంచి హైందవి విద్యా సంస్థల చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం ఇప్పటి వరకు తమ అభ్యర్ధిని ప్రకటించ లేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి ముస్లింకు టికెట్ ఇస్తే ఓట్లు భారీగా చీలే అవకాశం ఉందని ఎంఐఎం అధినేత భావిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular