గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సిఎం రేవంత్
ముఖ్యమంత్రితో చర్చించిన మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ
దసరాలోపు ఉమ్మడి మెదక్ జిల్లా నామినేటెడ్ పోస్టుల భర్తీకి సిఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జి మంత్రి సురేఖ కృషి ఫలించిందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. మెదక్ జిల్లా నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయమై సోమవారం ఇంచార్జి మంత్రి సురేఖ, మంత్రి దామోదర రాజనరసింహలు కలిసి సిఎం రేవంత్ రెడ్డితో గంటకు పైగా చర్చలు జరిపారు.
పలు సమీకరణాలకు సంబంధించి ఈ ముగ్గురు సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం సిఎం రేవంత్ రెడ్డి నామినేటెడ్ పోస్టుల భర్తీపై వారికి స్పష్టతనిచ్చారు. దసరాలోపు నామినేటెడ్ పోస్టులను భర్తీ పూర్తి చేయాలని సిఎం రేవంత్ రెడ్డి మంత్రి సురేఖతో తెలిపారు.