హైదరాబాద్‌లో భారీ చోరీ జరిగింది. ఫిలింనగర్‌లో ఉంటున్న ఓ కుటుంబం ఇఫ్తార్ విందుకు వెళ్లి వచ్చేసరికి ఇంట్లో ఉన్న డబ్బు, బంగారం, నగలు అన్ని దోచేశారు. తలుపులు పగలగొట్టి ఎన్‌ఆర్‌ఐ ఇంట్లోకి ప్రవేశించి కొట్టేశారు. షేక్‌పేటకి చెందిన మహ్మద్ ముజాహిద్ కమల్ కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. అయితే ఇటీవల హైదరాబాద్‌కి వచ్చారు. రంజాన్ మాసం కావడంతో ముజాహిద్ బంధువుల ఇంటికి కుటుంబ సభ్యులతో కలిసి ఇఫ్తార్ విందుకు వెళ్లారు. తెల్లవారు జామున 2 గంటలకు ఇంటికి వచ్చే సరికి తలుపులు పగలగొట్టిన, ఇళ్లంతా చిందరవందరగా కనిపించింది. ఇంటి లోపలికి వెళ్లి చూడగా మొత్తం చిందరవందర చేసి 34 తులాల బంగారం, 4.5 లక్షల డబ్బు, 550 కెనడియన్ డాలర్లు తీసుకెళ్లారు. అయితే దొంగతనం చేసే ముందు దుండగులు సీసీ కెమెరాలు, డీవీఆర్ అన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.