- భద్రత బలగాలకు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు
- 30 మంది మావోయిస్టులు మృతి ` ఒక జవాన్ మృతి
- భారీగా ఆయుదాలు స్వాధీనం ` మృతదేహాలను గుర్తించే పనిలో పోలీస్ అధికారులు
తెలంగాణకు సరిహద్దున ఉన్న ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలోని దండకారణ్యంలో మరోసారి భీకర కాల్పుల మోత మోగింది. భద్రత బలగాలకు , మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో 30 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు బస్తర్ ఐజి సుందర్ రాజు ఇప్పటికే వెల్లడిరచారు.అలాగే కాంకేర్ జిల్లా కోరస్ కోడ్ గ్రామంలో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రత బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. భద్రత బలగాలు ఎదురు కాల్పులు జరుపడంతో 4 మావోయిస్టులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలోని దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దులోని గంగలూరు , అండ్రి దండకారణ్యంలో మావోయిస్టులు ఉన్నారనే పక్కా సమాచారంతో బుధవారం సాయంత్రం భద్రత బలగాలు దండకారణ్యంలోకి వెళ్ళారు. ఇది గమనించిన మావోయిస్టులు భద్రత బలగాలపై ఒక్కసారిగా కాల్పుల మోత మోగించారు. ప్రతిఘటించిన భద్రత బలగాలు కాల్పులు ప్రారంభించడంతో ఆ ప్రాంతంలో 26 మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. అలాగే కాంకేర్ జిల్లా కోరస్ కోడ్ గ్రామంలో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రత బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు.
భద్రత బలగాలు ఎదురు కాల్పులు జరుపడంతో 4 మావోయిస్టులు మృతి చెందారు. మొత్తం గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో 30 మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టులు దండకారణ్యంలో ఉన్నారనే విషయం తెలుసుకుని గురువారం ఉదయం నుండే భద్రత బలగాలు ఆ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. 30 మంది మావోయిస్టులతో పాటు మావోయిస్టుల కాల్పుల్లో డిఆర్‌జి జవాన్ రాజు మరణించారు. ఆ ప్రాంతంలో ఇంకా కూంబింగ్ జరుగుతూనే ఉంది. మృతి చెందిన మావోయిస్టుల కోసం భద్రత బలగాలు వెతుకుతున్నాయి. 30 మంది మావోయిస్టుల మృతదేహాలను భద్రత బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. వీరిని గుర్తించే పనిలో పోలీస్ ఉన్నాతాధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.
మృతి చెందిన వారిలో అగ్రనేతలు ఉన్నారనే సమాచారం తెలుస్తుంది.మృత దేహాల వద్ద భారీ మొత్తంలో ఆటో మెటిక్ ఆయుధాలు మందుగుండ్రు సామాగ్రితో పాటు విప్లవ సాహిత్యాల పుస్తకాలు లభించినట్లు ఐజి తెలిపారు. బీజాపూర్,దంతెవాడ , కాంకేర్ దండకారణ్యంలోకి భద్రత బలగాలు డిఆర్‌జి, స్పెషల్ టాక్స్‌ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే 2025 జనవరి నుండి మార్చి వరకు సుమారు 100కు పైగా మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. అలాగే 2024లో భద్రత బలగాల చేతిలో సుమారు 220 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తుంది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ 2026 నాటికి మావోయిస్టు పార్టీని సమూళంగా అంతమొందిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో తరచూ మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగులుతూనే ఉంది.