Saturday, March 29, 2025

ఓఆర్​ఆర్​పై తొలిసారి డబుల్ డెక్కర్ ఇంటర్‌ఛేంజ్ – పెరగనున్న ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు

ఓఆర్​ఆర్​పై డబుల్ డెక్కర్ ఇంటర్‌ ఛేంజ్ నిర్మాణం – బుద్వేల్‌ లేఅవుట్‌ నుంచి అవుటర్‌కు అనుసంధానం – ఓఆర్‌ఆర్‌పై 23కు పెరగనున్న ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు.

ఓఆర్​ఆర్​పై తొలిసారి డబుల్ డెక్కర్ ఇంటర్‌ ఛేంజ్‌ రూపుదిద్దుకోనుంది. రెండు ఎంట్రీ, రెండు ఎగ్జిట్ మార్గాలతో రెండు లేన్లతో ఈ మార్గాన్ని నిర్మించనున్నారు. బుద్వేల్ వద్ద హెచ్‌ఎండీఏ లేఅవుట్ నుంచి అవుటర్ రింగ్‌ రోడ్డుతో లింకు కోసం దీన్ని నిర్మిస్తున్నారు. రింగు రోడ్డుపైకి ఎక్కడ పడితే అక్కడే వాహనాలు వచ్చే అవకాశం లేదు.

కేవలం ఇంటర్ ఛేంజ్‌ల వద్ద మాత్రమే అవుటర్ పైకి, కిందకు వాహనాలు రాకపోకలు సాగించేందుకు వీలుంటుంది. అవుటర్ నిర్మాణ సమయంలో తొలుత వీటిని 19 ప్రాంతాల్లో మాత్రమే ఏర్పాటు చేశారు. తర్వాత కాలంలో అవుటర్ చుట్ట పక్కల భారీ ఎత్తున నివాస సముదాయాలు పెరుగుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో హెచ్‌ఎండీఏ కొత్తగా ఇంటర్‌ఛేంజ్‌లను అందుబాటులోకి తీసుకొస్తుంది.

ఇంటర్ ఛేంజ్ వివరాలు ఇలా ఉన్నాయి
ర్యాంపులు దారి ఎక్కడ నుంచి ఎక్కడి వరకు దూరం (కి.మీ)
1 ఎగ్జిట్ లేఅవుట్ నుంచి శంషాబాద్ వైపు 0.529
2 ఎంట్రీ పటాన్‌చెరు వైపు నుంచి లేఅవుట్‌లోకి 0.474
3 ఎంట్రీ శంషాబాద్‌ నుంచి లేఅవుట్‌లోకి 0.876
4 ఎగ్జిట్ లేఅవుట్ నుంచి పటాన్‌చెరు వైపు 0.931

పెరగనున్న ఎంట్రీ, ఎగ్జిట్లు: బుద్వేల్‌లో 182 ఎకరాల్లో హెచ్‌ఎండీఏ లేఅవుట్‌ సిద్ధం చేసింది. 4 ఎకరాల నుంచి 6 ఎకరాల వరకు మొత్తం 17 ప్లాట్లను గతంలో అమ్మింది. తాజాగా ఇందులో మౌలిక వసతులకు హెచ్‌ఎండీఏ రూ.380 కోట్ల నిధులను ఖర్చు చేస్తోంది. ఇందులో భాగంగా లేఅవుట్‌ నుంచి నేరుగా అవుటర్‌ రింగ్‌ రోడ్డు పైకి చేరుకునేందుకు డబుల్‌ డెక్కర్‌ ఇంటర్‌ఛేంజ్‌ను నిర్మిస్తోంది.

శంషాబాద్‌, పటాన్‌చెరు వైపు ఎంట్రీ, ఎగ్జిట్‌ ఉండనున్నాయి. ఈ రెండు లేన్లు ఒకదానిపై ఒకటి ఏర్పాటు చేయనున్నారు. అవుటర్‌పై ఇంతవరకు ఎక్కడా పై వంతెనల నిర్మాణం చేపట్టలేదు. తొలిసారి బుద్వేల్‌ వద్ద ఇలాంటి మార్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఏడాదిలోపు దీనిని అందుబాటులోకి తేనున్నట్లు హెచ్‌ఎండీఏకు చెందిన అధికారి తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com