కోమటిరెడ్డి ఏక్ నాథ్ షిండే…!!?
బీజేపీతో టచ్ లో ఉన్న ఐదుగురు మంత్రులెవరనేది చర్చనీయాంశంగా మారింది. ఇవాళ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..తాము తల్చుకుంటే 48 గంటల్లో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా కేంద్ర మంత్రి Nithin Gatkari నితిన్ గడ్కరీ వద్దకు వెళ్లి తాను ఏక్ నాథ్ షిండేలా మారుతానని చెప్పింది నిజం కాదా..? అని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. తమ పార్టీ అధినాయకత్వంతో ఐదుగురు మంత్రులు టచ్ లో ఉన్నారని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. శుక్రవారం Komati Reddy Venkat Reddy కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ గా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్ లో దుమారం రేపాయి. రియల్టర్లు, వ్యాపారుల దగ్గర రేవంత్ రెడ్డి ఎంతెంత వసూలు చేశారో తన వద్ద చిట్టా ఉందని మహేశ్వర్ రెడ్డి అన్నారు.
ALSO READ:
దొంగ హామీలు ఇచ్చి వసూళ్లు చేసుకునేందుకే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని విమర్శించారు. రాష్ట్రంలో #RTax ఆర్ ట్యాక్స్ నడుస్తోందని, ఆర్ అంటే రేవంతా..? రాహులా తనకు తెలియదని చెప్పారు. బీజేపీ లోకి ఎవరొచ్చినా రాజీనామా చేసి రావాలని, అది తమ పార్టీ సిద్దాంతమని చెప్పారు. బీజేపీ ఎప్పుడూ ఏ ప్రభుత్వాన్నీ కూల్చదని అన్నారు. 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లోకి వస్తారని మంత్రి కోమటిరెడ్డి చెప్పడంపై మహేశ్వర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే 48 గంటల్లో కాంగ్రెస్ సర్కారు కూలడం పక్కా అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కోమటిరెడ్డిని హోంగార్డు అని అన్నారని, ఆయన ఆ స్థాయికే పరిమితమని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి నుంచి పోటీ చేస్తున్నబీజేపీ అభ్యర్థి Bura Narsaiah Goud బూర నర్సయ్యగౌడ్ రెండు లక్షల ఓట్లు మెజార్టీతో విజయం సాధించబోతున్నారని చెప్పారు.