- అధికారులకు తెలంగాణ ఎక్సైజ్ కమిషనర్ ఇ.శ్రీధర్ ఆదేశం
- ‘సే నో డ్రగ్స్’ టీ షర్ట్‌ను విడుదల చేసిన కమిషనర్
తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలన పై తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని, డ్రగ్స్ కట్టడి కావాలంటే నిరంతరం దాడులు నిర్వహించాలని అప్పుడే డ్రగ్స్‌ను తుది ముట్టించడానికి అవకాశం ఉంటుందని తెలంగాణ ఎక్సైజ్ కమిషనర్ ఇ.శ్రీధర్ పేర్కొన్నారు. ఎక్సైజ్ కార్యాలయంలో జరిగిన రంగారెడ్డి జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ దశరథ్, అసిస్టెంట్ కమిషనర్ ఆర్.కిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌లు సైతం పాల్గొన్నారు. ‘సే నో డ్రగ్స్’ పేరుతో రూపొందించిన టీ షర్ట్‌ను కమిషనర్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ శ్రీధర్ మాట్లాడుతూ డ్రగ్స్‌పై దాడులు ఎప్పటికప్పుడు నిర్వహిస్తూనే ఎక్సైజ్ శాఖ పరువును పెంచాలని ఆయన అధికారులకు సూచించారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌పై నిఘాపెట్టాలని అధికారులకు కమిషనర్ సూచించారు. అనంతరం రంగారెడ్డి జిల్లాలో ఎన్‌డిపిఎల్ మద్యం పట్టివేతతో పాటు రెవెన్యూ పెంపు ఇతర అంశాలపై కమిషనర్ సమీక్షించారు. ఈ సమావేశంలో శంషాబాద్ వికారాబాద్, మల్కాజిగిరి, మేడ్చల్, సరూర్ నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌లు కృష్ణప్రియ, విజయ భాస్కర్, ఎస్‌కె ఫయాజుద్దీన్, కె.నవీన్ కుమార్, ఉజ్వలరెడ్డితో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్, డిటిఎఫ్, ఎక్సైజ్ సిఐలు, ఎస్‌ఐలు ఈ సమావేశానికి హాజరయ్యారు.