హైదరాబాద్‌లో పలు రెస్టారెంట్లపై జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో అపరిశుభ్రంగా ఉన్న రెస్టారెంట్లపై చర్యలు తీసుకున్నారు. రాజేంద్రనగర్, అత్తాపూర్‌లో పలు రెస్టారెంట్లపై అధికారుల దాడుల్లో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. రాజేంద్రనగర్‌లో ది ఫోర్ట్, డెలిష్ బై హోమ్స్ కిచెన్ రెస్టారెంట్లు నిబంధనలు పాటించడం లేదని అధికారులు తనిఖీల్లో వెల్లడైంది. కుళ్లిపోయిన కూరగాయలు వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని అధికారులు చెప్పారు. కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ రెస్టారెంట్లలో గడువు ముగిసిన నిత్యావసర సరుకులు వాడుతున్నట్లు గుర్తించారు. రెస్టారెంట్ నిర్వాహకులకు ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ప్రముఖ రెస్టారెంట్లలో దాడులు చేసిన సమయంలో కిచెన్‌లో పరిస్థితి చూసి ఫుడ్‌సెఫ్టీ అధికారులు సీరియస్ అయ్యారు. రోజుల తరబడి ఆహార పదర్థాలు నిల్వ ఉంచే ప్రమాదకరమైన పదార్థాలు వాడుతున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా హోటల్ నిర్వాహకులను అధికారులు హెచ్చరించారు. ఆహార పదార్థాల్లో హానీకరమైన కెమికల్స్‌ను ఉపయోగించడం నిషిద్ధం. అయినా కూడా ఫుడ్‌సేప్టీ నిబంధనలను తుంగలో తొక్కి మరీ నిబంధనలకు విరుద్ధంగా రెస్టారెంట్ నిర్వాహకులు వినియోగిస్తున్నట్లు అధికారులు కనుగొన్నారు. పలు రెస్టారెంట్లను సీజ్ చేయడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న రెస్టారెంట్లపై ఫుడ్‌సేఫ్టీ అధికారులు కేసులు నమోదు చేశారు. కుళ్లిపోయిన కూరగాయలు వాడుతున్నట్లు అధికారులు కనుగొన్నారు. కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు తిరుగుతున్నాయని కూడా గమనించారు. గడువు ముగిసిన పదార్థాలను ఆహారపదార్థాలల్లో వాడుతున్నారని బయటపడింది.