Tuesday, May 13, 2025

12 యూరప్ దేశాలు….22 మంది మీడియా ప్రతినిధులు…

ఈనెల 20 వ తేదీ వరకు తెలంగాణలో పర్యటించనున్న విదేశీ జర్నలిస్టులు వివిధ దేశాల సాంస్కృతిక వైవిధ్యాన్ని అధ్యయనం చేసి పరస్పర అవగాహనతో ప్రజల మధ్య సామరస్య వాతావరణాన్ని పెంపొందించడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. అందులో భాగంగా ఆగ్నేయాసియా, దక్షిణాసియా, యూరోప్, ఆఫ్రికా, అమెరికా దేశాల మీడియా ప్రతినిధులు మనదేశంలో పర్యటించడానికి భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ , ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పర్యటన షెడ్యూల్‌ను రూపొందించింది. మీడియా ఎక్చేంజ్‌లో భాగంగా ఆదివారం నుంచి ఈనెల 20 వ తేదీ వరకు 12 యూరప్ దేశాలకు చెందిన 22 మంది మీడియా ప్రతినిధులు తెలంగాణలో పర్యటిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే వారంతో ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో యూరోపియన్ మీడియా బృందానికి రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ ఎం.హన్మంత రావు ఆదేశాల మేరకు రాష్ట్ర మీడియా అకాడమీ సెక్రటరీ నాగులపల్లి వెంకటేశ్వరరావు స్వాగతం పలికారు. ఈ మీడియా బృందం వెంట న్యూ ఢిల్లీ నుంచి విదేశీ వ్యవహారాల మంత్రత్వశాఖ అధికారి చంద్రేశ్ సింగ్ సైతం వచ్చారు. యూరప్‌లోని ఆల్బెనియా, క్రొయేషియా, సైప్రస్, చెక్ రిపబ్లిక్, ఈస్తొనియ, ఫిన్లాండ్, లాట్వియా, లిథుయేనియా, పోలాండ్, రొమేనియా, సెర్బియా, స్లోవేకియా దేశాల్లోని పలు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన 22 మంది ప్రతినిధులు ఈ బృందంలో ఉన్నారు. తెలంగాణ పర్యటనలో భాగంగా ఆదివారం గోల్కొండ కోట, శిల్పారామాలను వారు సందర్శి స్తారు. ఈ నెల 18వ తేదీన భారత్ బయోటెక్, టి హబ్, టి వర్స్, స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీలను, 19వ తేదీన ఐఎస్‌బి, రామోజీ ఫిల్మ్ సిటీలను వారు సందర్శించి. ఆయా సంస్థల గురించి తెలుసుకుంటారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com