బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలన్న జగన్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈవీఎంల పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియలో భాగమైన ఈవీఎంల వినియోగంపై చర్చ జరుగుతున్న క్రమంలో మొన్న జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియల్లో అభివృద్ధి చెందిన దాదాపు అన్ని ప్రజాస్వామ్య దేశాలు పేపర్ బ్యాలెట్లను ఉపయోగిస్తున్నాయని, ఈవీఎంలను వాడడం లేదని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.
మన ప్రజాస్వామ్యం నిజమైన స్ఫూర్తిని చాటిచెబుతూ మనం కూడా పేపర్ బ్యాలెట్స్ దిశగా అడుగులు వేయాలి.. అని ట్వీట్ చేశారు జగన్. మనకు జరిగిన న్యాయం కనిపించాలని ఏవిధంగానైతే మనం కోరుకుంటామో, అదేవిధంగా ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉండటమే కాకుండా నిస్సందేహంగా ప్రబలంగా కనిపించాలని ట్వీట్ లో పేర్కొన్నారు వైఎస్ జగన్. ఈవీఎంలపై జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.