Monday, November 18, 2024

తుమ్మబాల కన్నుమూత నివాళులర్పించిన సీఎం రేవంత్​

హైదరాబాద్‌ మాజీ ఆర్చ్‌ బిషప్‌ తుమ్మబాల (80) అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. వరంగల్‌ బిష్‌పగా 25 ఏళ్ల పాటు పని చేసిన తుమ్మ బాల అంత్యక్రియలు శుక్రవారం ముగిశాయి. సికింద్రాబాద్‌ సెయింట్‌ మేరీ బసిలికీలో తుమ్మబాల పార్థివ దేహాన్ని భూస్థాపితం చేశారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ఇందుకు సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వరంగల్‌ జిల్లా నర్మెట్టలో 1944 ఏప్రిల్‌ 24న జన్మించిన తుమ్మ బాలను పోప్‌ సెయింట్‌ జాన్‌పాల్‌ 2 ద్వారా 1986 నవంబరు 17న వరంగల్‌ రెండో బిష్‌పగా నియమితులయ్యారు. అనంతరం పోప్‌బెనడిక్ట్‌ తుమ్మ బాలను 2011 మార్చి 12న హైదరాబాద్‌ ఆర్చ్‌ బిష్‌పగా నియమించారు. ఆంధ్ర ప్రదేశ్ బిషప్స్ కౌన్సిల్ ఛైర్మన్ తో పాటుగా 2020 వరకు డియోసెస్ కమ్యూనికేషన్ కమిషన్ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. 2020లో ఆర్చ్‌ బిష్‌పగా పదవీ విరమణ చేసిన తుమ్మబాల హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌ మండలం కరుణాపురంలోని దివ్యజ్యోతి నిలయంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుతం అక్కడే ఉంటున్న తుమ్మబాల కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం తుది శ్వాస విడిచారు. కాగా, కాజీపేటలోని ఫాతిమా కెథడ్రిల్‌ చర్చిలో ఉంచిన తుమ్మబాల పార్థివ దేహానికి వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, హనుమకొండ జడ్పీ చైర్మన్‌ ఎం.సుధీర్‌కుమార్‌ నివాళులర్పించారు.

తుమ్మబాల సేవలు మరువలేనివి

సికింద్రాబాద్ సెయింట్ మేరీ స్కూల్ లో తుమ్మబాల పార్దీవ దేహానికి సీఎం రేవంత్​ రెడ్డి శుక్రవారం ఉదయం నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో తుమ్మబాల ఎనలేని సేవలు అందించారని, శాంతి, మతసామరస్యం, విద్యను ప్రజలకు పంచారన్నారు. వ్యక్తిగతంగా తుమ్మబాలతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, 2019 ఎంపీ ఎన్నికల్లో, 2023 శాసనసభ ఎన్నికల్లో మంచి మనసుతో ఆశీర్వదించారని గుర్తు చేసుకున్నారు. తుమ్మబాల ఆశీర్వాదంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, ఆయన మరణం అభిమానులకు తీరని దుఃఖాన్ని మిగిల్చిందని, తుమ్మబాల సేవలను కొనియాడుతూ ఆయన సందేశం స్ఫూర్తితో ముందుకెళ్లాలని రేవంత్​ రెడ్డి కోరారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular