Tuesday, March 11, 2025

ఇక నెక్ట్స్​ బాస్​..? ఫోన్​ ట్యాపింగ్​ కేసులో మాజీ సీఎం..?

టీఎస్​, న్యూస్​: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏ-4 నిందితుడిగా ఉన్నాడు మాజీ ఓఎస్డీ రాధా కిషన్ రావు రిమాండ్ రిపోర్టులో బీఆర్ఎస్​ బాస్​ చెప్పితేనే చేసినట్లు తేలింది. స్పష్టంగా దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు వెల్లడించాడు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రణీత్ రావు అండ్ కో ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రతిపక్ష నేతలకు సంబంధించిన డబ్బులను సీజ్ చేసినట్టు రాధా కిషన్ రావు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. ఈ క్రమంలోనే దుబ్బాక అప్పటి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు రాష్ట్ర డిజిపిని కలిసి ఫిర్యాదు చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఫోన్లను టాప్ చేసినట్టు ఫిర్యాదు చేశారు. 2020లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా ప్రణీత్ రావు అండ్ కో తన ఫోను టాప్ చేసినట్టు ఫిర్యాదు చేశారు.

అప్పట్లో ప్రణీత్రావు ఇచ్చిన సమాచారం ఆధారంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు బేగంపేట్ వద్ద రఘునందన్ రావుకి సంబంధించిన కోటి రూపాయల నగదును సీజ్ చేశారు. సిద్దిపేటకు సంబంధించిన చిట్ ఫండ్ కంపెనీ యాజమాన్యం, ఆయన బంధువులు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా వారి సంభాషణలు విన్న ప్రణీత్ రావ్ అండ్ కో టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందించడంతో రఘునందన్ రావుకు చెందిన నగదును సీజ్ చేశారు. ఈ కేసులో రాధాకిషన్​రావు స్టేట్​మెంట్​ ఆధారంగా బీఆర్ఎస్​ బాస్​కు నోటీసులు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ వ్యవహారంలో బీఆర్​ఎస్​ బాస్​ను విచారించాలని ఇటు ప్రభుత్వం నుంచి కూడా ఆమోదం వచ్చినట్లు తెలుస్తున్నది. దీంతో నేడో, రేపో ఆయనకు నోటీసులిచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడటం, వ్యక్తిగత స్వేచ్ఛను హరించేందుకు కుట్ర పర్చడంతో పాటు ఎన్నికల నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి ఉప ఎన్నికల్లో పోలీసు అధికారుల విరులను దుర్వినియోగం చేసి తన స్వార్థ రాజకీయాల కోసం వినియోగించుకోవడం తదితర అంశాలపై బాస్​ను విచారించాలని దర్యాప్తు బృందం నిర్ణయించింది.

Also Read: చంచల్​ గూడ జైలుకు అడిషనల్​ ఎస్పీలు

ఎప్పుడు.. ఎలా..?
రాధా కిషన్​రావు స్టేట్​మెంట్​ ఆధారంగా బీఆర్ఎస్​ బాస్​ను ఎప్పుడు విచారణకు పిలవాలి, ఎవరు విచారించాలన్న అంశం పై అధికారులు షెడ్యూల్​ చేస్తున్నట్లు సమాచారం. ఏ4 నిందితుడు రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా మొత్తం వ్యవహారం వెనుక బీఆర్ఎస్​బాస్​ ఉన్నట్లు అధికారులు నిర్ధారణకు వచ్చాడు. దుబ్బార, మునుగోడు ఉప ఎన్నికలకు కల్బులను పంపిణీ చేయడంతో పాటు అధికార విపక్ష పార్టీలకు చెందిన నేతల ఫోర్ ఐను బ్యాప్ చేసి వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి ఆదరింపులు, ఔనరంపులకు దిగడం, బంగారు వ్యాపారులను బెదరించి యాదాద్రి దేవాలయం పేరుతో భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేయడం, సెలబ్రిటీలను బెదరించి తమ స్వంత పనులకు సహకరించాలని సత్తిడి తేవడం తదితర అంశాలనందీపై మరింత స్పష్టత రావాలంటే రాధాకిషన్​రావు చెప్పిన బాస్​ను విచారించక తప్పదని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. దీనికితోడు భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు తదితరులు గత పాలకుల ఒత్తిడి వల్లే ఫోన్ ట్యాపింగ్ చేయడం, పోలీసు వాహనాలలో ఉప ఎన్నికల సందర్భంగా డబ్బులను పంపిణీ చేయడం జరిగిందని చెప్పడంతో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉండన్న బలమైన ఆధారాలు లభించాయని సిట్​ అధికారులు భావిస్తున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com