Sunday, April 20, 2025

ఆర్గానిక్ పద్దతిలో వ్యవసాయం చేస్తున్న మాజీ సీఎం కేసీఆర్

  • ఆర్గానిక్ పద్దతిలో వ్యవసాయం చేస్తున్న మాజీ సీఎం కేసీఆర్
  • పూర్తి సమయం వ్యవసాయంతోనే గడుపుతున్న గులాబీ బాస్

బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‎ కు వ్యవసాయం చేయడం అంటే మహా ఇష్టమన్న సంగతి అందరికి తెలిసిందే. చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ కేసీఆర్ మాత్రం వ్యవసాయం చేస్తూనే ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సైతం టైం దొరికిన ప్రతిసారి ఫామ్ హౌస్‎కి వెళ్లి వ్యవసాయ పనులను స్వయంగా పర్యవేక్షించేవారు కేసీఆర్. అప్పట్లో కొత్త వంగడంగా ఆలుగడ్డలు పండించి రైతులందరిని కూడా ఆ కొత్త పద్ధతుల్లో వ్యవసాయం చేయాలని ప్రోత్సహించారు.

గత పదేళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిదా ఉన్న సమయంలో కూడా టైం చిక్కినప్పుడల్లా ఫామ్ హౌస్‎కి వెళ్లి వ్యవసాయాన్ని పరిశీలించేవారు కేసీఆర్. ఐతే ఈ పదేళ్లు సీఎంగా భాద్యతల నేపధ్యంలో వ్యవసాయంపై పూర్తి సమయం దృష్టిపెట్టే ఛాన్స్ దొరకలేదనే చెప్పాలి. కానీ ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఆయనకున్న తీరిక సమయాన్ని పూర్తిగా వ్యవసాయంపైనే దృష్టి పెట్టారు గులాబీ బాస్. ప్రస్తుతం తన వ్యవసాయ క్షేత్రంలో కొత్త కొత్త వరి వంగడాలను తెప్పించి నాట్లు వేయించారు కేసీఆర్. అవి కూడా పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తూ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు.

గ్లూకోస్ కంటెంట్ చాలా తక్కువగా ఉండే షుగర్ ఫ్రీ రైస్‎ని కేసీఆర్ పండిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతే కాదు పలు రకాల పండ్ల మొక్కలు, అన్ని సీజన్లలో దొరికే ఫ్రూట్స్ తో పాటు ఆర్గానిక్ కూరగాయలను సైతం పండిస్తున్నారట కేసీఆర్. తన ఫామ్ హౌజ్ మొత్తం ఈ మధ్య సాయిల్ టెస్ట్ చేయించి.. ఎక్కడ సారవంతమైన భూమి ఉంది.. అక్కడ ఏ పంటలు వేయచ్చు అనే దానిపై అక్కడున్న పనివాళ్లకు ఒక అవగాహన కల్పించి మరీ పంటలు పండిస్తున్నారట మాజీ సీఎం కేసీఆర్.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com