భారతరత్న, బీజేపీ సీనియర్ నేత, ఎల్‌కే అధ్వాణీ అస్వస్థతకు గురయ్యారు. ఆయనను ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేర్చినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. 96 ఏళ్ల ఆధ్వాణీ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. జూన్ నెలలో ఓసారి అస్వస్థతకు గురవడంతో ఎయిమ్స్‌లో చేర్చారు. యూరాలజీ వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. ఆ తర్వాత జులై మొదటివారంలో మరోసారి అనారోగ్యానికి గురవడంతో అపోలో ఆసుపత్రిలో రెండు రోజుల పాటు చికిత్స తీసుకున్నారు. తాజాగా మంగళవారం మరోసారి అస్వస్థతకు గురికావడంతో.. మరోసారి అపోలోకు తరలించారు.