Monday, March 10, 2025

మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు

  • నా 30 ఏళ్ల సర్వీసులో కేవలం 10 నుంచి 15 ఏళ్లు మాత్రమే సక్రమమైన పోస్టుల్లో పని చేశా..
  • 2004 లో రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చి కమ్మ వ్యతిరేక పాలసీ నీ తెచ్చి దాన్ని స్టేట్ పొలసీ గా మార్చారు.

రాజశేఖర రెడ్డి నాటిన విత్తనం 2019 నాటికి విష వృక్షంగా మారింది. అప్పటి నుంచి కమ్మ అధికారులు టార్గెట్ గా అణచివేతకు గురి చేశారు. కమ్మ వారి పై యుద్ధమే ప్రకటించినట్లు వైసిపి అధినేత వ్యవహరించాడు. 2019 లో అధికారంలోకి వచ్చిన మర్నాడే నాకు ఉద్యోగం లేకుండా చేశారు. పోస్టింగ్, జీతం అడిగితే సస్పెండ్ చేసారు. నా కెరీర్ లో నేను ఊహించని మచ్చ ను నాకు వేయాలని చూశారు, కానీ చట్టం, న్యాయం రెండు నన్ను నిప్పుగా నిలపెట్టాయి.

కరోనాకు, వాక్సిన్ కు, ఎలక్షన్ కమిషనర్ కు కులం రంగు పూసి విచక్షణా రహితంగా వ్యవహరించారు. 2004 నుంచి రాజకీయాలు కమ్మ వారిని కాపాడ లేక పోతున్నాయి. కమ్మ వారి పట్ల సానుభూతి, అభిమానం ఉన్నా కాపాడేందుకు రాజకీయ పార్టీలు ముందుకు రావు. వరదలు వచ్చినా, వైపరీత్యాలు వచ్చినా 75 శాతం విరాళాలు కమ్మ వారివే.. సామాజిక వర్గంతో పాటు సమాజానికి సైతం అందరూ తోడ్పడాలి.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com