Friday, February 21, 2025

కేసీఆర్‌ అం‌టే నాలుగు కోట్ల ప్రజల భావోద్వేగం

ఆయన మొండి పట్టుదల, పోరాటంతోనే తెలంగాణ కల సాకారం
తెలంగాణను దేశానికి రోల్‌ ‌మోడల్‌ ‌గా మార్చారు..
పుట్టిన రోజు వేడుకల్లో మాజీ మంత్రి హరీశ్‌ ‌రావు

కేసీఆర్‌ ‌జన్మదినం రాష్ట్ర ప్రజలందరికీ పండుగ రోజని, కేసీఆర్‌ అం‌టే ఒక వ్యక్తి కాదు, ఒక నాయకుడు కాదు, నాలుగు కోట్ల ప్రజల భావోద్వేగమని మాజీ మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. తెలంగాణ భవన్‌ ‌లో నిర్వహించిన కేసీఆర్‌ ‌పుట్టిన రోజు వేడుకల్లో మాజీ మంత్రి హరీశ్‌ ‌రావు మాట్లాడారు. కేసీఆర్‌ 1954‌లో పుట్టారు.. ఆయన పుట్టిన రెండేళ్లకే ఉన్న తెలంగాణను ఆనాటి కాంగ్రెస్‌ ‌పార్టీ ఆంధ్రాలో కలిపిందని అన్నారు.  1969లో మలి దశ తెలంగాణ ఉద్యమం వొచ్చిన నాడు కేసీఆర్‌ ‌వయస్సు 16 ఏండ్లు. ఆ వయసులోనేజై తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. కేసీఆర్‌ ‌సహా తెలంగాణ వాదులు ఇష్టం ఉన్నా లేకున్నా ఆంధ్ర పాలకుల పార్టీల్లో పని చేశారు. కేసీఆర్‌ ‌కూడా తెలుగుదేశంలో పని చేశారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రశ్నిస్తూ వొచ్చారు. అన్నీ భరించారు. తెలంగాణ బాగు పడాలంటే రాష్ట్ర ఏర్పాటు తప్ప మరొక దారి లేదని బయటికొచ్చారు.

కరెంట్‌ ‌బిల్లులు పెంచితే తెలంగాణ ప్రజలకు ఉరితాడు అయిదని చెప్పారు. వందలు, వేల గంటల మేధోమదనం తర్వాత తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్‌ ‌శ్రీకారం చుట్టారు. 1969 నుంచి 2001 మధ్య అనేక మంది జై తెలంగాణ అని ఉద్యమం ప్రారంభించి, పదవి రాగానే మధ్యలో వొదిలిపెట్టారు. దాని వల్ల ప్రజల్లో అపనమ్మకం కలిగింది. ఆ అపవాదును తొలగించడానికి మూడు పదవులను గడ్డి పోచలుగా త్యజించారు. తెలంగాణ ప్రజల్లో నమ్మకం కల్పించారు కేసీఆర్‌ ‌డిప్యూటీ స్పీకర్‌ ‌పదవి, కార్యదర్శి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.  కేసీఆర్‌ ‌మీద సంపూర్ణమైన విశ్వాసం ఉందని నాడు ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌ ‌రావు అనేవారు. ఎంతో మంది మేధావులు కేసీఆర్‌ ‌మీద విశ్వాసం ఉంచారు. ఆ నమ్మకాలను కేసీఆర్‌ ‌నిలబెట్టారు. 2001 నుంచి కేసీఆర్‌ ‌తో పని చేసే అదృష్టం నాకు దొరికింది. తెలంగాణ కోసం ఎంతో శ్రమించారు. ఎన్నో బాధలు అనుభవించారు. మొండి ధైర్యంతో పోరాడి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చారు. దట్‌ ఈజ్‌ ‌కేసీఆర్‌ ‌పదవులకు ఆశపడినా, కుంగిపోయినా, వెనక అడుగు వేసినా ఈరోజు మన తెలంగాణలో మనం ఉండే వాళ్లం కాదు.తెలంగాణ వచ్చిందం టే అది కేసీఆర్‌ ‌మొండి పట్టుదల, పోరాటం వల్లే. ఫిబ్రవరి 17 ఎంత ముఖ్యమో, నవంబర్‌ 29 ‌కూడా అంతే ముఖ్యం.  కేసీఆర్‌ ‌సచ్చుడో తెలంగాణ వచ్చుడో, అయితే తెలంగాణ జైత్ర యాత్ర లేదంటే నా శవయాత్ర అని చెప్పి ఆమరణ దీక్షకు దిగారు. కేసీఆర్‌ ‌ప్రాణ త్యాగానికి సిద్ధమై దిల్లీ పీఠాన్ని కదిలించారు.

డిసెంబర్‌ 9, 2009 ‌ప్రకటన వచ్చిందంటే కేసీఆర్‌ ‌గారి దీక్ష ఫలితం ఆయన దీక్ష చేయకుంటే ఈనాడు తెలంగాణ ప్రకటన వొచ్చేదా. దీక్ష విరమించండి, మేము తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తామని చిదంబరం ఫోన్‌ ‌చేస్తే, కేసీఆర్‌ ‌వినలేదు. తెలంగాణ ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన వస్తేనే దీక్ష విరమిస్తానని కేసీఆర్‌ ‌భీష్మించుకున్నారు. అప్పటికే 11 రోజులైంది. ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింది. కానీ పట్టుదల మాత్రం వదలలేదు. మీరే రాసి పంపండి అంటే, జయశంకర్‌ ‌స్వహస్తాలతో రాసి దిల్లీకి పంపితే, దాన్నే చిదంబరం దిల్లీ నుంచి అనౌన్స్ ‌చేశారు. అలా తెలంగాణ తెచ్చున్నాం. తెలంగాణ తేవడమే కాదు, తెలంగాణను కన్నబిడ్డ లెక్క చూసుకున్నారు. పదేండ్లలో కన్న బిడ్డ లాగా తెలంగాణను తీర్చిదిద్దారు. తాగు నీరు, సాగు నీరు, విద్యుత్‌… అన్ని రంగాల్లో తెలంగాణను అద్బుతంగా తీర్చిదిద్దారు. దేశానికి రోల్‌ ‌మోడల్‌ ‌గా చేశారు.

2020 మ్యాచులు ఆడుతున్నా అని రేవంత్‌ అం‌టున్నాడు. ఆయన ఆడుతున్నవన్నీ తొండి మ్యాచులు..  పైసల కోసం ఆడుతున్న మ్యాచులు. కేసీఆర్‌ ‌టెస్టు, వన్‌ ‌డే, 2020 ఏదైనా అద్బుతంగా ఆడుతారని హరీష్‌రావు అన్నారు.   ఎప్పుడు ఏది ఆడాలో కేసీఆర్‌ ‌కు బాగా తెలుసని,  అవసరం అయితే డిఫెన్స్ ‌లేదంటే సిక్స్ ‌లు కొడుతారని కొనియాడారు. తెలంగాణలో  ఎక్కడికి వెళ్లి అడిగినా ప్రజలు మళ్లీ కేసీఆర్‌ ‌రావాలంటున్నారని, కూలీ పని చేసుకునే వాళ్ల దగ్గర నుంచి రోడ్ల మీద పోయే పిల్లల వరకు అందరూ కేసీఆర్‌ ‌రావాలటున్నారు. రేవంత్‌ ‌పాలన బాగోలేదని తిడుతున్నారని చెప్పారు. ఓటమి విజయానికి నాంది అంటారు. భవిష్యుత్‌లో మరో మూడు టర్ములు గెలవడానికి ఇది నాంది కాబోతుందని, అందరూ కేసీఆర్‌ ‌వైపు చూస్తున్నారని, తెలంగాణ వొచ్చిందంటే, దిల్లీ కదిలిందంటే దానికి కారణం కారణజన్ముడు కేసీఆరేనని హరీష్‌ ‌రావు తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com