Wednesday, December 25, 2024

గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హరీష్ రావు

వాంకిడి ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలైన ఘటన మరువకముందే నేడు మంచిర్యాల గిరిజన ఆశ్రమ పాఠశాలలో మరో ఘటన జరగటం దారుణం.

12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైన ఘటన బాధ కలిగిస్తున్నది.

పదేపదే ఇలాంటి ఘటన జరుగుతున్న ప్రభుత్వం మొద్దు నిద్ర వీడకపోవడం శోచనీయం.

అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో ఏం జరుగుతున్నది?

విద్యార్థుల ప్రాణాలంటే ప్రభుత్వానికి పట్టింపు లేదా?
పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం కూడా ప్రభుత్వానికి చేతకావడం లేదా?

చదువుకోవడానికి పాఠశాలలకు వెళ్తే ప్రాణాలు కోల్పోయే దౌర్భాగ్య పరిస్థితి రావడం అత్యంత హేయం.

కారణాలు చెబుతూ తప్పించుకోవడం వల్ల ప్రయోజనం లేదు. విద్యార్థుల ప్రాణాల పట్ల కార్యాచరణ ప్రకటించండి.

గురుకులాల్లో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com