Saturday, February 22, 2025

రేవంత్‌ ‌నోటి నుంచి బూతులు తప్ప నీతులు రావు..

  • అధికారం కోసం కాంగ్రెస్‌ ‌నేతలను తొక్కుకుంటూ వొచ్చారు..
  • సీఎం వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్‌ ‌రావు ఫైర్‌

చేతగానోనికి మాటలెక్కువ, చేవలేనోనికి బూతులెక్కువ అన్నట్లు రేవంత్‌ ‌రెడ్డి వ్యవహారం ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు ఎద్దేవా చేశారు. 11 నెలల పాలనలో ఆయన నోటి నుంచి బూతులు తప్ప నీతులు రాలేదని ఫైర్‌ అయ్యారు. కాంగ్రెస్‌ ‌విజయోత్సవ సభ అని పేరు పెట్టుకొని చేసింది ఏమీ లేక, చెప్పుకోవడానికి ఏమీ లేక ఎప్పటి లాగే పిచ్చి మాటలు మాట్లాడారని ధ్వజమెత్తారు.

ఇక ఆయన ఎంత గింజుకున్నా లాభం లేదని, అశోక్‌ ‌నగర్‌ ‌నుంచి లగచర్ల దాకా, రైతుల నుంచి లంబాడి బిడ్డల దాకా ఆయన చేసిన ఘోరాలు సమసిపోవని అన్నారు.  రేవంత్‌ ‌రెడ్డి..! కేసీఆర్‌.. ‌కేసీఆర్‌.. అం‌టూ కేసీఆర్‌ ‌నామస్మరణ చేసినంత మాత్రాన నీ పాపం పోదు. కేసీఆర్‌ ‌వంటి గొప్ప వ్యక్తి జీవితంలో అర్థం కాడు. తొక్కుకుంటూ వొచ్చానని గప్పాలు కొడుతున్నవు. అధికారంలోకి వొచ్చేందుకు కాంగ్రెస్‌ ‌నాయకులను సీఎం రేవంత్‌ ‌తొక్కాడని, షార్ట్ ‌కట్‌ ‌లో అధికారం చేజిక్కించుకొని ప్రజలను తొక్కుతున్నాడని, నీ వదురుబోతు తనంతో రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదని. ఆయన  దుర్భాషను ప్రజల విచక్షణకే వదిలేస్తున్నామని హరీష్‌ ‌రావు పేర్కొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com