Thursday, March 20, 2025

భట్టి బడ్జెట్ బడా జూట్ బడ్జెట్

  • పచ్చి అబద్దాలు, అతిశయోక్తులు తప్ప ఏమి లేవు
  • బడ్జెట్ ద్వారా కాంగ్రెస్ తన విశ్వసనీయత కోల్పోయింది..
  • రాష్ట్ర బడ్జెట్ పై మండిపడ్డ మాజీ మంత్రి హరీష్ రావు

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం చూస్తే రాజకీయ ప్రసంగం లాగా ఉందని. పచ్చి అబద్దాలు, అతిశయోక్తులు తప్ప మరేం లేవని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. తెలంగాణ బడ్జెట్ పై మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భట్టి బడ్జెట్ – బడా జూట్ బడ్జెట్ ఈ బడ్జెట్ ద్వారా కాంగ్రెస్ పార్టీ తన విశ్వసనీయతను కోల్పోయిందన్నారు. ఎన్నికల ముందు అన్ని చేస్తాం. అధికారంలోకి రాగానే ఏమి చేయమని మాదిరి ఈ బడ్జెట్ ప్రసంగం ఉందని తెలిపారు. ఎన్నికల అసెంబ్లీ బయట, లోపల ర రేవంత్ రెడ్డి అబద్ధాలే మాట్లాడుతున్నాడు. లక్ష కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ఇస్తున్నామని అన్నారు. రూ.20వేల కోట్లు ఇచ్చామన్నారు. గతేడాది వొచ్చే ఏడాది లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. మొత్తం వర్తిస్తుందా అంటే లేదు 5లక్షల వరకే వర్తిస్తుందని అని జీవో 27 ప్రకారం అని అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. రూ.5 లక్షల వరకే వడ్డీ లేని రుణం, మిగతా 15 లక్షలకు మహిళలే వడ్డీలు కడుతున్నారు. అసెంబ్లీ సాక్షిగా మహిళలందర్ని ప్రభుత్వం మోసం చేసింది.

స్కూల్ విద్యార్థుల డ్రెస్ కుట్టు చార్జీలు రూ.75 ఇస్తున్నామంటున్నారు. గత బడ్జెట్ లోనూ ఇదే చెప్పారు, మక్కీకి మక్కీ కాపీ కొట్టారు. ఈ ప్రభుత్వం నిజంగా ఇస్తున్నది 50 రూపాయలు మాత్రమే. 75 ఇచ్చినట్లు రెండు బడ్జెట్లలో చెప్పుకున్నారు. ఇక రేషన్ కార్డుల విషయానికొస్తే గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని బడ్జెట్ లో చెప్పారు., బీఆర్ఎస్ 6లక్షల 47వేల రేషన్ కార్డులు ఇచ్చింది. దీనిపై సవాల్ కు సిద్ధం. 72పేజీల భట్టి ప్రసంగం గురించి చెప్పాలంటే బడ్జెట్ లో రెండు పేజీలు పెరిగింది తప్ప.. పేదల సంక్షేమం పెరగలేదు. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని సోనియాగాంధీతో ప్రజలకు ఉత్తరం రాయించారు.

ఈ బడ్జెట్ లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తారని రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా చూశారు. మహాలక్ష్మి ఊసే లేదు. 2500 లేదు గానీ, రూ.2500 కోట్లతో అందాల పోటీల కోసం బడ్జెట్ లో పెట్టారు. చేయూత కింద 4000 పింఛన్ అతీ గతీ లేదు. కొత్త పింఛన్లు ఇవ్వలేదు, ఉన్న పింఛన్ రెండు నెలలు ఎగ్గొట్టారు. లక్షా 50 వేల పింఛన్లు తగ్గాయి. రుణమాఫీ అయినోళ్లు తక్కువ, కానోళ్లు ఎక్కువ. రెండు లక్ష మీద ఉన్న వాళ్లకు కాలేదు, ఆ లోపు ఉన్న వాళ్లకు కాలేదు. నా నియోజకవర్గంలో రెండు లక్షల లోపు ఉన్న 10,150 మందికి రుణమాఫీ కాలేదు. రుణమాఫీ విషయంలో రైతులను మోసం చేశారు. తులం బంగారానికి కేటాయింపులు లేవు. గత బడ్జెట్ లో ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు ఆరు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేస్తామన్నారు. ఒక్క ప్రాజెక్టు పూర్తి అయిందా అయితే ఒక్క దాని పేరు చెప్పండి. ఈ బడ్జెట్ లో ప్రస్తావనే లేదు. ఉత్తర భాగానికి భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. దక్షిణ భాగానికి డీపీఆర్ చేస్తున్నామని మళ్లీ పాత బడ్జెట్ లోని అంశమే చెప్పారు. జీఎస్డీపీ గ్రోత్ రేటు 12.9శాతం ఉంటే, కాంగ్రెస్ పాలనలో 10.1శాతం అన్నారు.

2.8శాతం ఎందుకు తగ్గింది. తలసరి ఆదాయం మా పాలనలో 12.4శాతం. కాంగ్రెస్ పాలనలో 9.6శాతం. రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే అప్పులు అప్పులు అంటాడు. బడ్జెట్ పుస్తకాలు చూస్తే రెవెన్యూ సర్ ప్లస్ సేట్ అని చెబుతుంది. మీ ఆలోచన విధానం వల్ల దివాలా తీసింది. ఈ ఏడాది ఎక్సైజ్ ద్వారా 50వేల కోట్ల రాబడి ఆశిస్తున్నారు. బిఆర్ఎస్ హయాం కంటే 12 నుంచి 13 వేల కోట్లు ఎక్కువ. మద్యం ధరలు విపరీతంగా పెంచారు. తాగుబోతుల తెలంగాణగా మార్చుతున్నారు. అమ్మకాలు పెంచలేదని అధికారులకు ఛార్జి మెమోలు ఇస్తున్నారు. ఎఫ్ఆర్బిఎఫ్ అప్పులు పెరిగాయి. మైనార్టీస్ కోసం గతంలో మూడు వేల కోట్లు చెప్పారు. వెయ్యి కోట్లు కూడా ఖర్చు చేయలేదు. కేసీఆర్ ప్రారంభించిన షాదీ ముబారక్ ఇవ్వడం లేదు. మైనార్టీ మంత్రి లేడు, కనీసం ఎమ్మెల్సీ ఇవ్వలేదు, బడ్జెట్ కూడా లేదు. కేసీఆర్ ప్రతి మండలానికి డబుల్ లైన్ రోడ్లు వేశారు. 40:60 ప్రభుత్వం, కాంట్రాక్టర్ ద్వారా రోడ్లు వేస్తారా.? మండలాలు, జిల్లాలకు పోవాలంటే టోల్ కట్టాలా? హ్యాం మోడల్ తెస్తే ప్రజల జేబులకు చిల్లు పడుతుంది. బీసీలకు మొండి చేయి చూపింది, రూ. 20వేల కోట్లు ఎక్కడ? బడ్జెట్ లో పదివేల కోట్లు మాత్రమే పెట్టారు. సీఎస్ఎస్ ద్వారా కేంద్రం నుంచి 15,729 కోట్లు వస్తాయని బడ్జెట్ లో పెట్టారు.

2023-24 లో వచ్చింది 5,966 కోట్లు. కేంద్రం నుంచి 1.34శాతమే కేంద్ర ఇచ్చింది. 2.9శాతం అని పెట్టారు. అన్ రియలిస్టిక్ బడ్జెట్ ఇది. పేదల ఇండ్లు కట్టుకోవడానికి 5లక్షలు, ఎస్సీ, ఎస్టీకి 6లక్షలు, మొత్తం 4,50,000 ఇండ్లు కడతామని గత బడ్జెట్ లో పెట్టారు. బడ్జెట్లో 22,500 కోట్లు పెట్టారు. 22 పైసలు ఖర్చు చేయలేదు, ఒక్క ఇళ్లు ఈ రాష్ట్రంలో కట్టలేదన్నారు. భట్టి బడ్జెట్ బడా జూట్ బడ్జెట్ అని ఎద్దేవా చేశారు. ఈ బడ్జెట్ ద్వారా కాంగ్రెస్ తన విశ్వసనీయతను కోల్పోయిందని విమర్శించారు. .

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com