Thursday, December 12, 2024

విగ్రహాలపై ఉన్న ధ్యాస విద్యార్థులపై లేదా?

రేవంత్‌ ‌ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్‌ ‌రావు ఫైర్‌
‌దిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడంపై ఉన్న ధ్యాస, పిల్లల భవిష్యత్తుపై లేదా?  అని మాజీ మంత్రి హరీష్‌ ‌రావు సీఎం రేవంత్‌ ‌పై మండిపడ్డారు.   రాష్ట్రాన్నే కాదు.. కనీసం సొంత జిల్లా ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలను కూడా ముఖ్యమంత్రి పట్టించుకోవడంలేదని అన్నారు. ఉమ్మడి మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో వరుస ఫుడ్‌ ‌పాయిజన్లు జరిగి విద్యార్థులు దవాఖానల పాలవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? అని నిలదీశారు.  పది రోజులు కాకముందే మంగళవారం వికారాబాద్‌ ‌జిల్లా తాండూరు గిరిజన బాలికల హాస్టల్‌ ‌లో ఫుడ్‌ ‌పాయిజన్‌ ‌జరిగి 15 మంది హాస్పిటల్‌ ‌పాలయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు.

సిఎం సొంత జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెంత దారుణ పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అని అన్నారు.. రాష్ట్రంలో వరుస ఫుడ్‌ ‌పాయిజన్‌ ‌కేసులు నమోదవుతున్నా, విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడక పోవడం దుర్మార్గమని ఫైర్‌ అయ్యారు.  విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపిస్తామన్న సీఎం రేవంత్‌ ‌రెడ్డి.. మాటలు నీటి మూటలే అయ్యాయి. మాటలే తప్ప చేతలు లేని ముఖ్యమంత్రి నిర్లక్ష్య తీరు వల్ల ఇంకెంత మంది విద్యార్థులు దవాఖానల పాలు కావాలి, ఇంకెందరు ప్రాణాలు కోల్పోవాలి? అని హరీష్‌ ‌రావు ప్రశ్నించారు.

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular