Tuesday, December 24, 2024

సీఎం రేవంత్ కు 70 ఎంఎం సినిమా చూపిస్తాం..

సంజయ్ పాదయాత్ర ట్రైలర్ మాత్రమే ..
ప్ర‌జా పాలనలో రైతుల ధాన్యం దలారుల పాలు
రైతుబంధు, రుణమాఫీ అంతా బోగ‌స్‌
సంజ‌య్ పాద‌యాత్ర‌లో మాజీ మంత్రి హ‌రీష్ రావు

రైతులకు మద్దతుగా కోరుట్ల నుంచి జగిత్యాల వరకు ఎమ్మెల్యే సంజయ్ పాదయాత్ర కేవ‌లం ట్రైల‌ర్ మాత్ర‌మేన‌ని, ముందుముందు సీఎం రేవంత్ రెడ్డికి 70ఎంఎం సినిమా చూపిస్తామ‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు అన్నారు. పాద‌యాత్ర అనంతరం నిర్వహించిన సభలో మాజీ మంత్రి హరీష్ రావు ప్ర‌సంగించారు.  సంజయ్ మంచి ఎమ్మెల్యేగా ప్ర‌జ‌ల‌కు తెలుసున‌ని త‌మ‌కు యశోద హాస్పిటల్ డాక్టర్ గా ప‌రిచ‌య‌మ‌ని, ఎవరికి ఆపద వొచ్చినా నేను ఫోన్ చేస్తే బిల్లు మాఫీ చేసేవార‌ని కొనియాడారు. వెన్నుముక శస్త్రచికిత్స చేసే డాక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న సంజయ్.. ఈరోజు దేశానికి వెన్నుముకైన రైతుల కోసం 25 కిలోమీటర్లు పాదయాత్ర చేశారని ప్ర‌శంస‌లు కురిపించారు.
రేవంత్ రెడ్డి పాలనలో రైతుల ధాన్యం దలారుల పాలయింద‌ని, క్వింటాల్ పైన ఒక్కొక్క రైతు రూ.వెయ్యి నష్టపోతున్నాడ‌ని అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో రేవంత్ రెడ్డి వరి పంటకు బోనస్ అని అబద్ధపు ప్రచారం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. వడ్ల కొనుగోలు సీజన్ వొస్తుందంటే కేసీఆర్ నెలరోజుల ముందు నుంచే స‌మీక్షలు నిర్వ‌హించేవార‌ని, వడ్లు కొన్న 24 గంటల లోపే రైతులకు పైసలు అందించార‌ని గుర్తుచేశారు.  కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల వడ్లు కొనాలని, మొద్దు నిద్రపోతున్న రేవంత్ ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు ఎమ్మెల్యే సంజయ్ పాదయాత్ర చేశారన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com