Monday, April 7, 2025

జర్నలిస్టులపైనా మీ ప్రతాపం…

ఓయూ ఘటనలపై మాజీ మంత్రి హరీష్‌ ‌రావు
ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు  బిఆర్‌ఎస్‌ ‌నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ ‌రావు ప్రకటించారు. డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరసనలు తెలియజేస్తుంటే, విధి నిర్వహణలో భాగంగా ఆ వార్తలు కవర్‌ ‌చేయడమే వారు చేసిన తప్పా..అంటూ నిలదీశారు. జర్నలిస్టులను అరెస్టు చేయడం, బలవంతంగా పోలీస్‌ ‌స్టేషన్‌కు తరలించడం వి•డియా హక్కును, స్వేచ్ఛను కాలరాయడమే అని ఆయన పేర్కొన్నారు.
జర్నలిస్టుల పట్ల అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని మార్చుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేస్తున్నాం అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్‌ ‌లైబ్రరీ వద్ద డీఎస్సీ అభ్యర్థుల ఆందోళనలను కవరేజ్‌ ‌చేసేందుకు వెళ్లిన జీ న్యూస్‌ ‌రిపోర్టర్‌ ‌పట్ల పోలీసులు అమర్యాదగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. జీ న్యూస్‌ ‌రిపోర్టర్‌ ‌చొక్కా పట్టుకుని పోలీసులు లాక్కెళ్లారు. నేను జర్నలిస్టును.. వి• పని వి•రు చేసుకోండి.. మా పని మేం చేసుకుంటాం అంటుంటే కూడా పోలీసులు వినిపించుకోకుండా, బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com