Sunday, December 29, 2024

మాజీ మంత్రి హరీష్ రావును వెంటనే అరెస్ట్ చేయాలి

రాష్ట్ర ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ డిమాండ్
మాజీ మంత్రి హరీష్ రావును వెంటనే అరెస్ట్ చేయాలని రాష్ట్ర ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ డిమాండ్ చేశారు. గాంధీ భవన్‌లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హరీష్‌రావుపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సిఎం పదవి రాజ్యాంగ బద్దమైనదని, ఆ పదవిని అగౌరవపరిచే విధంగా హరీష్ రావు మాట్లాడారని, ఇది చట్ట వ్యతిరేకమని, అందుకే ఆయనపై బేగంబజార్ పిఎస్‌లో సెక్షన్ 352, 353/1, 353/2 కింద ఫిర్యాదు చేసినట్టు ఆయన తెలిపారు. ఒక శాసనసభ్యుడిగా ఉన్న మీరే ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తే సామాన్య ప్రజానీకానికి మీరిచ్చే సందేశం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

హరీష్‌రావు ‘చీప్ మెన్’ అని బహుషా కెసిఆర్‌ను అనాల్సిన మాటలు రేవంత్ రెడ్డిని అన్నట్లు ఉన్నారని మెట్టు సాయికుమార్ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి పది నెలల్లో సిఎం పదవికి ఎంతో ఉన్నతి తెచ్చారని, ఈ విషయం ప్రజలకు తెలుసన్నారు. సిఎం అనే పదానికి గౌరవ తీసుకొచ్చిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు.

అలాగే హరీష్ రావు వ్యాఖ్యలు తెలంగాణ సభ్యసమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని, సిఎం రేవంత్ రెడ్డికి అసెంబ్లీ సాక్షిగా క్షమాపణ చెప్పాలని మెట్టు సాయికుమార్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో హరీష్ రావును అసెంబ్లీ సమావేశాలకు రానివ్వకుండా అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. తక్షణమే రేవంత్ రెడ్డికి భేషరతుగా క్షమాపణ చెప్పి, ఆయన అన్న పదాలను వెనక్కి తీసుకోవాలని మెట్టు సాయికుమార్ డిమాండ్ చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com