మాజీ మంత్రి మల్లారెడ్డి సంగీత్‌లో వేసిన డ్యాన్స్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మనువరాలు అయిన మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ కూతురు వివాహ వేడుకలో భాగంగా సంగీత్ కార్యక్రమంలో సూపర్ కాస్ట్యూమ్‌లో డీజే టిల్లు పాటకు మల్లారెడ్డి డ్యాన్స్ అదరగొట్టాడు.
మాజీ మంత్రి మల్లారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాలమ్మిన, పూలమ్మిన, కష్టపడ్డ అనే డైలాగ్‌తో సోషల్ మీడియాను షేక్ చేసిన సంగతి తెలిసిందే. మల్లా రెడ్డి ఇలా ఏదో విధంగా ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండ్‌ను సృష్టిస్తారు. అయితే ప్రస్తుతం మల్లారెడ్డి డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
మనువరాలు సంగీత్‌లో..
మల్కాజ్ గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ కూతురు, మల్లారెడ్డి మనవరాలు వివాహం ఈ నెల 27న జరగనుంది. ఈ క్రమంలో జరిగిన సంగీత్ కార్యక్రమంలో మాల్లారెడ్డి ఊరమాస్ స్టెప్‌లతో డ్యాన్స్ చేశారు. నిన్న రాత్రి జరిగిన ఈ సంగీత్‌లో డిజే టిల్లు పాటకి సూపర్ కాస్ట్యూమ్‌లో డ్యాన్స్ చేశారు.
75 ఏళ్ల వయస్సులో కూడా మల్లారెడ్డి స్టేజ్ పైన ఇలా డ్యాన్స్ చేయడంతో ఆయన గ్రేస్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇంతకు ముందు కూడా మల్లారెడ్డి చాలా చోట్ల డ్యాన్స్ వేశారు. కానీ ఈ సారి స్టెప్‌ల్లో గ్రేస్ ఉందంటున్నారు. ప్రస్తుతం ఈ డ్యాన్స్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఈ సంగీత్ కార్యక్రమానికి కేవలం దగ్గర బంధువులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు అందరూ డ్యాన్స్ వేయమనడంతో మల్లారెడ్డి డ్యాన్స్ వేసినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులతో పాటు నెటిజన్లు కూడా ఆయన గ్రేస్, ఎక్స్‌ప్రెషన్స్‌కి ఫిదా అవుతున్నారు.