- బిఆర్‌ఎస్ పార్టీవి చౌక బారు రాజకీయాలు
- పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శలు తప్పు అని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ పార్టీవి చౌక బారు రాజకీయాలు చేస్తుందని ఆయన ఆరోపించారు. శుక్రవారం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ పాఠ్య పుస్తకాల్లో కెసిఆర్ ఫొటో ఉందని, దానిని తీసి వేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశంకు ఫిర్యాదు చేశానని ఆయన తెలిపారు. ముందు మాటలో ఆ పేజీ తొలగించి పంపించమని చెప్పామన్నారు. ఎస్‌సిఆర్‌టి ఉద్యోగుల తప్పిదం వల్ల ఇలా జరిగిందన్నారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
బిఆర్‌ఎస్ నాయకులకు విచారణ సంస్థలు ఇచ్చిన నోటీసులకు ముందు సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. కెసిఆర్ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారన్నారు. ఆరు పథకాల్లో భాగంగా యువ వికాసం ప్రారంభించామన్నారు. అంతర్జాతీయ పాఠశాలను ప్రతి మండలంలో తమ ప్రభుత్వం ప్రారంభిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శ పాఠశాలలో మొదటి సారిగా పాఠ్య పుస్తకాలతో పాటు నోట్ బుక్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్నామన్నారు. రూ.14 వందల కోట్లతో 24 లక్షల మంది విద్యార్థులకు అదనపు తరగతి గదులు, భోజనశాలలు బాత్ రూంలు కట్టిస్తున్నామని ఆయన తెలిపారు.