Thursday, November 21, 2024

దేవుడి మీద వొట్టు పెట్టి మాట తప్పారు: ఎమ్మెల్యే  హరీష్ రావు 

దేవుడి మీద వొట్టు పెట్టి మాట తప్పినోళ్లు ఎవరైనా ఉంటారా..?అని ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రశ్నించారు. కానీ, అధికారంలోకి వొచ్చేందుకు రేవంత్‌రెడ్డి అన్ని దేవుళ్లపైన ఒట్టు పెట్టుకున్నాడనీ, గత పంద్రాగస్టు వరకు రైతులకు రుణమాఫీ చేస్తానని ఒట్టు పెట్టుకుని మాట తప్పాడన్నారు.  ఈ నెల 8న బర్త్‌డే సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామి దగ్గరకు వెళ్తుండని పేపర్లలో చూశాననీ, దేవుడి దగ్గరికి వెళ్లితే మంచిదే…మేము కూడా అడ్వాన్స్ ‌జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నామనీ, రేవంత్‌రెడ్డి బర్త్ ‌డే జరుపుకుంటే మాకు కంటగింపు ఏమీ లేదన్నారు. అయితే, ప్రజలను మంచిగా చూసుకుంటే చాలన్నారు. యాదగిరి లక్ష్మీనరసింహా స్వామి మీద ఒట్టు పెట్టి అటున్న సూర్యుడు ఇటు పొడిసినా.. పంద్రా ఆగస్టు వరకు రుణమాఫీ చేస్తానని మాటతప్పినందుకు తప్పయిందని దేవుని ముందు ముక్కు నేలకు రాయాలన్నారు. రుణమాఫీ విషయంలో  దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పిన రేవంత్‌రెడ్డి దేవుడి దగ్గరకు వెళ్లి  మొక్కి తప్పయిందని  ఒప్పుకుని, చెంపలేసుకుని దేవుడి దగ్గర ముక్కు నేలకు రాయాలన్నారు.

పాలకుడే పాపాత్ముడయితే ఆ రాజ్యానికి అరిష్టమైతుందనీ, ఈ రాష్ట్రానికి రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి వి, నువ్వే దేవునిమీద ఒట్టు చేసి మాట తప్పితే ప్రజలకు ఏమైనా నష్టం కాజిక్కా.  నీవే తప్పు చేసినవు, అబద్దం మాట్లాడినవు, దేవుడి మీద ఒట్టేసి తప్పు చేసినందుకుగానూ దేవుడి దగ్గర క్షమించమని  వేడుకుని గుంజీలు తీయాలన్నారు. తప్పయిందని వేడుకుంటే దేవుడు క్షమిస్తాడన్నారు. రైతులకు సిఎం రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలు నిలబెట్టుకునే వరకు  బిఆర్‌ఎస్‌ ‌పార్టీ రైతుల పక్షాన నిలబడి పోరాడుతుందన్నారు.

ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు కూడా రేవంత్‌రెడ్డిని విడచిపెట్టమనీ, వెంబడి పడతామని హెచ్చరించారు. గతంలో బిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రభుత్వ ఇచ్చిన విధంగా కరెంటు కూడా ఇవ్వడం లేదనీ, రైతులకు 24గంటల నాణ్యమైన కరెంటు ఇచ్చే వరకు ఊరుకోమన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీ 15గంటలు కూడా కరెంటు ఇవ్వకున్నా 24గంటలు ఇస్తున్నట్లు కాంగ్రెస్‌ ‌పార్టీ ట్విట్టర్‌లో పెట్టుకోవడం సిగ్గు చేటన్నారు. ఈ వొచ్చే కరెంటు కూడా అప్పుడప్పుడు ట్రిప్‌ అవుతుందనీ, ఇప్పటికైనా రైతులకు నాణ్యమైన 24గంటల కరంటు ఇవ్వాలని సిఎం రేవంత్‌రెడ్డి హరీష్‌రావు డిమాండ్‌ చేశారు.  సమావేశంలో బిఆర్‌ఎస్‌ ‌నాయకులు వేలేటి రాధాకృష్ణశర్మ, మారెడ్డి రవీందర్‌రెడ్డి, రాఘవపూర్‌కు చెందిన రైతులు  పాల్గొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular