Tuesday, May 13, 2025

బీజేపీలోకి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్..?

  • బీజేపీలోకి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్..?
  • డీకే అరుణతో సంప్రదింపులు పూర్తి
  • జితేందర్ రెడ్డి కాంగ్రెస్​లో చేరడంతో..
  • కమలం వైపు చూస్తున్న శ్రీనివాస్ గౌడ్

టీఎస్​, న్యూస్​ : మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎ స్ పార్టీ నుంచి మరో నాయకుడు కమలం గూటికి చేరబోతున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీని వాస్ గౌడ్ ఓడిపోయారు. అయితే ఇటీవల బీజేపీ నుంచి జితేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వెళ్లిపోయారు.దీంతో జిల్లాలో మరో బలమైన నాయకుడి కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. దానిలో భాగంగానే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను సంప్రదించినట్టుగా ప్రచారం జరుగుతోంది. స్వయంగా డీకే అరుణ… శ్రీనివాస్ గౌడ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు శ్రీనివాస్ గౌడ్ పై పలు కేసులు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన పవర్ లో లేకపోవడం, బీఆర్ఎస్ కూడా అధికారంలో లేకపోవడంతో కేసులలో ఇబ్బంది అవుతుందని భావించి కమలం నేతలతో టచ్ లోకి వెళ్లారని ప్రచారం జరుగుతోంది. ఈ కేసుల విషయంలో బీజేపీ నుంచి శ్రీనివాస్ గౌడ్ కు హామీ వచ్చిందని జిల్లాలో మాట్లాడుకుంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఆయన కాషాయ కండువా కప్పుకుంటారనే మాట వినిపిస్తోంది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com