Wednesday, May 14, 2025

మాజీ ఎంపీ దామోదర్​రెడ్డి కన్నుమూత

నల్గొండ మాజీ ఎంపీ తుమ్మలపల్లి దామోదర్ రెడ్డి సోమవారం కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్​ వినయ్​నగర్​లోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య సులోచన, కుమారుడు సుభాష్​ చంద్రారెడ్డి, కుమార్తె ఝాన్సిలక్ష్మీ ఉన్నారు.
నల్గొండ జిల్లా పీఏపల్లి మండలం అజ్మాపురానికి చెందిన దామోదర్​రెడ్డి.. 1980లో కాంగ్రెస్​ అభ్యర్థిగా నల్గొండ పార్లమెంట్​ నుంచి పోటీ చేసి ఎంపీగా ఎన్నికయ్యారు. అప్పట్లో సీపీఐ అభ్యర్థి బొమ్మగాని ధర్మబిక్షంపై గెలిచారు. తిరిగి 1984లో పోటీచేసి టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.
కాగా, దామోదర్​రెడ్డి మరణవార్త విషయం తెలియగానే శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దామోదర్ రెడ్డి పార్ధీవదేహానికి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com