Thursday, May 15, 2025

ఖమ్మం టికెట్ నాకు ఇస్తే మెజారిటీతో గెలుస్తా

  • సిఎం రేవంత్‌రెడ్డితో చర్చించా
  • మాజీ ఎంపి వి.హనుమంతరావు

ఖమ్మం టికెట్ తనకిస్తే మెజారిటీతో గెలుస్తానని మాజీ ఎంపి వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సిఎం రేవంత్ రెడ్డిని ఇటీవల కలిశానని ఖమ్మం లోక్ సభ సీటు ఇవ్వాలని కోరానని ఆయన అన్నారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని ఆయన తెలిపారు. రాజీవ్ గాంధీతో అక్కడే తిరిగానన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్‌లో ఎవరెవరు ఉన్నారో తెలియాలన్నారు. అప్పటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో రికార్డ్ చేశారని ఆయన ఆరోపించారు.

ఇందులో ఇంకా చాలా అంశాలు బయటకు రావాలన్నారు. రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్‌ల ఫోన్లు ట్యాప్ చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్‌లో అసలు సూత్రధారులు ఎవరు? ఫోన్ ట్యాపింగ్ లో ఇప్పటికే పలువురు అధికారులు అరెస్ట్ అయ్యారని ఆయన పేర్కొన్నారు. నయీం అనే గ్యాంగ్‌స్టర్ట్ గతంలో కోట్ల రూపాయలు, భూములు కాజేశాడని, నయీం మరణం తర్వాత అక్కడ దొరికిన డబ్బులు ఏమయ్యాయి ? అని విహెచ్ ప్రశ్నించా రు. సిట్ అధికారిగా నాగిరెడ్డి ఉన్నారన్నారు. శివనంద రెడ్డి వెనుక నయీం ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సిఎం రేవంత్ రెడ్డి వీటిపై విచారణ జరిపితే ఆ భూములను పేద ప్రజలకు ఇవ్వొచ్చన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com