టీఎస్, న్యూస్:సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన కేసులో రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ తో పాటు14 మంది బీఆర్ఎస్ నాయకులను ఎన్టిపిసి పోలీసుల అరెస్టు చేశారు. అనంతరం స్టేషన్ బెయిల్ ఇచ్చి మాజీ ఎమ్మెల్యే ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాట్లాడేందుకు కూడా స్వేచ్ఛ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ప్రజల పక్షాన మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేస్తామన్నారు.