Tuesday, March 11, 2025

ప్రభాకర్​రావు కమింగ్​..?!

నేడు అమెరికా నుంచి హైదరాబాద్​కు

టీఎస్​, న్యూస్​: ఫోన్​ ట్యాపింగ్​ కేసులో కీలక వికెట్​ పోలీసుల చేతికి చిక్కుతున్నది. ఈ కేసులో ఏ1గా ఉన్న A1 Former intelligence chief Prabhakar Rao ఇంటలీజెన్సీ మాజీ చీఫ్​ ప్రభాకర్​రావు నేడో, రేపో హైదరాబాద్​కు రానున్నట్లు సమాచారం అందింది. ఈ వ్యవహారంలో సాగుతున్న అంశాలపై ఇటీవలే ఓ పోలీస్​ఉన్నతాధికారితో మాట్లాడిన ప్రభాకర్​రావు.. తాను విదేశాల్లో ఉన్నానని, వచ్చిన తర్వాత మాట్లాడుతామని, ఈ ప్రభుత్వం చెప్తే ఎలా చేస్తున్నారో.. గత ప్రభుత్వం చెప్తే తామూ అదే చేశామంటూ చెప్పుకొచ్చారు.

మరోవైపు ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు పోలీస్​ అధికారులను అరెస్ట్​చేశారు. వారిని కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ విచారణలో అంతా చెప్పేది కూడా ఒక్కటే సమాధానం వస్తున్నది. పైస్థాయి అధికారులు, అప్పటి ప్రభుత్వ పెద్దలు చెప్తేనే తాము చేశామంటూ వెల్లడిస్తున్నారు. దీంతో ఏ1గా ఉన్న ప్రభాకార్​రావును విచారించడం పోలీసులకు అత్యవసరమవుతున్నది. మరోవైపు ఒక్కొక్క పేరు బయటకు వస్తుండటంతో.. రాజకీయ నేతలకు సైతం త్వరలోనే నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

నేను వస్తున్నా.. వచ్చాక చెప్తా
ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో కీలక సూత్రదారుడిగా ఉన్న Former SIB Chief Prabhakar Rao ఎస్ఐబీ మాజీ చీఫ్​ ప్రభాకర్​రావు విదేశాల్లో ఉండగా.. ఆయనకు లుక్​ అవుట్​నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన సోమవారం హైదరాబాద్​కు రానున్నట్లు సమాచారం ఇచ్చినట్లు పోలీస్​ అధికారులు చెబుతున్నారు. లుక్​ అవుట్​నోటీసు జారీ కావడంతో.. ఎక్కడైనా కనిపించినా అరెస్ట్​ చేసే అవకాశం ఉండటంతో ఆయనే గౌరవప్రదంగా వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ మొత్తం వ్యవహారంలో ఆయనే కేంద్రీకృతంగా నిలువడంతో.. ఆయన వచ్చాక ఈ కేసు కీలక మలుపులు తిరిగే అవకాశం ఉంది. ఫోన్​ ట్యాపింగ్​ చేసేందుకు ఆదేశాలిచ్చిన అప్పటి ప్రభుత్వ పెద్దలు ఎవరు, మొత్తం ఎన్ని ఫోన్లు ట్యాపింగ్​ చేశారు, వాటి రికార్డులను ఎక్కడ భద్రం చేశారు, దీని వెనక ఉన్నదెవరు అనే వివరాలన్నీ ప్రభాకర్​రావును విచారిస్తేనే తెలుస్తాయని సిట్​ పోలీసులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించారు.

నిజానికి, ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో నిందితులైన హైదరాబాద్‌ Former task force DCP Radhakishan Rao మాజీ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావు.. ఎస్​ఓటీ సీఐ గట్టు మల్లును పెట్టుకుని ఓ మాఫియా నడిపారని గుర్తించారు. ట్యాపింగ్ కేసు నమోదవగానే రాధాకిషన్‌ రావు అమెరికాకు వెళ్లిపోయారు. పోలీసులు లుకౌట్‌ నోటీసులను జారీ చేయడంతో సైలంట్ గా హైదరాబాద్ వచ్చేశారు. రాధాకిషన్‌రావు వచ్చినట్లుగా తెలియగానే విచారణకు హాజరు కావాలని నోటీసులిచ్చారు. ఇన్స్ పెక్టర్ గట్టుమల్లును కూడా విచారణకు పిలిపించి విచారణ చేసి అరెస్టు చూపించారు. ఫోన్‌ట్యాపింగ్‌కు సంబంధించిన సాంకేతిక పరికరాలను ధ్వంసం చేయటంలోనూ వీరు కీలక పాత్ర పోషించారు. ఈ కేసులో మొదటి ముద్దాయిగా చేర్చబడిన ప్రభాకర్‌రావును ఏ విధంగా అమెరికా నుంచి ఇక్కడకు తీసుకురావాలనే విషయమై సీనియర్‌ పోలీసు అధికారులు తర్జన, భర్జన పడుతున్నారు.

అవసరమైతే Interpol ఇంటర్‌పోల్‌ సాయాన్ని కూడా తీసుకోవాలని ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. అధికారుల్లో ప్రభాకర్‌రావును విచారిస్తే మరిన్ని ఆధారాలు Phonetapping ఫోన్‌ట్యాపింగ్‌కు సంబంధించినవి బయటపడతాయని స్పెషల్‌ టీం భావిస్తున్నది. అదుపులో ఉన్న రాధాకిషన్‌రావు, గట్టుమల్లుతో పాటు ఈ ఇద్దరు అదనపు ఎస్పీలను కూడా కలిపి విచారించే అవకాశముంది. ప్రభాకర్ రావును అరెస్ట్ చేసిన తర్వాత అప్పటి రాజకీయ బాసుల దగ్గరకు కేసు వెళ్లే చాన్స్ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభాకర్​రావు సోమవారం సాయంత్రం వరకు హైదరాబాద్​కు వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆయన ఇంటి దగ్గర కూడా పోలీసులను ఏర్పాటు చేశారు.

బాధితుల్లారా.. రండి Phone Tapping Victims 
ఇప్పటిదాకా నిందితులను విచారిస్తున్న సిట్​ పోలీసులు.. తాజాగా బాధితులను కూడా విచారణకు పిలుస్తున్నారు. ఎందుకు బెదిరించారు, ఎలా బెదిరించారు, ఎంతెంత ఇచ్చారు అనే విషయాలను తెలుసుకునేందుకు బాధితులను పిలుస్తున్నారు. ఈ కేసులో తొలుతగా రియల్​ ఎస్టేట్​ వ్యాపారి సంధ్యా శ్రీధర్​రావును సిట్​ పోలీసులు విచారణకు పిలిచారు. ఆదివారం దాదాపు మూడు గంటల పాటు విచారించారు. తన ఫోన్​ ట్యాపింగ్​చేశారని, వ్యాపారాలకు సంబంధించిన వివరాలు తీసుకున్నారని, బెదిరింపులకు గురి చేశారంటూ టాస్క్​ఫోర్స్​ డీసీపీ రాధా కిషన్​రావు మీద పంజాగుట్ట స్టేషన్​లో ఇటీవల శ్రీధర్​రావు ఫిర్యాదు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే విచారణ కోసం శ్రీధర్​రావును బంజారాహిల్స్​ పీఎస్​కు పిలిచి మాట్లాడారు. న్యాయవాదితో కలిసి హాజరైన శ్రీధర్​రావు వాంగ్మూలాన్ని సిట్​ పోలీసులు రికార్డు చేశారు. అయితే, ఫోన్ ట్యాపింగ్​తో ఇబ్బందులు పడిన బాధితులు తమను సంప్రదించాలంటూ పోలీసులు స్పెషల్​ ఆఫర్​ ఇచ్చారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com