Tuesday, July 9, 2024

భూమి వ్యవహారంలో వ్యాపారవేత్తను బెదిరించిన రాధా కిషన్ రావు

జూబ్లీహిల్స్ లో కేసు నమోదు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ నిందితుడు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. చంచల్ గూడా జైల్లో ఉన్న రాధా కిషన్ రావును పీటీ వారెంట్ పై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక భూమి వ్యవహారంలో వ్యాపారవేత్తను బెదిరించినదుకు జూబ్లీహిల్స్ లో రాధా కిషన్ పై కేసు నమోదైంది. అలాగే కంపెనీ వ్యవహారంలో రాధా కిషన్ రావు జోక్యం చేసుకొని సెటిల్మెంట్ చేశారని ఆరోపణలు వచ్చాయి. రూ. 150 కోట్ల కంపెనీని తక్కువ ధరకు మరొకరికి ఇప్పిచ్చారని రాధా కిషన్ రావు పై ఫిర్యాదు నమోదైంది. ఇదిలావుండగా, ఫోన్ ట్యాపింగ్ కేసు హైకోర్టులో విచారణ జరుగుతోంది.

ఈ కేసుకు సంబంధించి కీలకమైన అంశాలతో హైకోర్టులో పోలీసులు కౌంటర్ అఫిడవిట్ దాఖాలు చేశారు. కేసు దర్యాప్తు క్రమంలో కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావు మాస్టర్ మైండ్ గా పేర్కొన్నారు. ప్రభాకర్ రావు, నవీన్ రావు, ఓ మీడియా సంస్థ కు చెందిన శ్రవణ్ రావులకు కుట్రలో భాగం ఉన్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో స్వపక్షం, విపక్ష నాయకులే కాకుండా, ఉన్నతాధికారులు, న్యాయమూర్తులు, జర్నలిస్టులు ఇలా వందలాది మంది ఫోన్లు ట్యాపింగ్ అయినట్లు గుర్తించారు.

ప్రస్తుతం ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు లు విదేశాల్లో ఉన్నారు, వారిని విచారిస్తే కీలక విషయాలు బయటపడన్నాయని అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసి వారిని తీసుకురానున్నట్లు తెలిపారు. ఇప్పటిక వారిద్దరి పాస్ పోర్టులను జప్తు చేయాల్సిందిగా రీజినల్ పాస్ పోర్టు కార్యాలయానికి సమాచారం ఇచ్చినట్లు వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన డేటా తో పాటు ఎస్ఐబీకి చెందిన కీలక 62 హార్డ్ డిస్క్ లను ధ్వంసం చేసినట్లుగా గుర్తించామని పోలీసులు అఫిడవిట్ లో పేర్కొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ లో అడుగు పెట్టె సాహసం చేస్తాడా?
- Advertisment -

Most Popular