Monday, March 10, 2025

తెలుగులో రుణమాఫీ మార్గదర్శకాలు

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభినందనలు

రుణమాఫీ మార్గదర్శకాలకు సంబంధించిన జీవోను తెలంగాణ ప్రభుత్వం తెలుగులో ఇవ్వడం అభినందనీయమని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ ‌రెడ్డికి, వ్యవసాయ శాఖ సెక్రటరీ రఘునందన్‌ ‌రావు, రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతూ ట్వీట్‌ ‌చేశారు.

ప్రభుత్వ ఉత్తర్వులు తొలిసారి తెలుగులో జారీ చేయడం చాలా సంతోషకరం. తెలుగు రాష్టాల్ల్రో ప్రభుత్వ ఉత్తర్వులు సహా పరిపాలనకు సంబంధించిన అంశాలు తెలుగులో జారీ చేయాలని నేను ఎప్పటినుంచో సూచిస్తున్నా. ప్రజల కోసమే పరిపాలన అయినప్పుడు వారికి సులువుగా అర్థమయ్యే భాషలోనే ప్రభుత్వ ఉత్తర్వులు, పరిపాలనకు సంబంధించిన ఇతర సమాచారం ఉండాలి.

తెలుగు రాష్టాల్ర ప్రభుత్వాలు ఇకనుంచి అన్ని ఉత్తర్వులను, సమాచారాన్ని పూర్తిగా తెలుగులోనే అందించాలని ఆకాంక్షిస్తున్నా’ అని వెంకయ్య నాయుడు పోస్ట్?‌చేశారు. తొలిసారి తెలుగులో జీవో ఇవ్వడం తెలుగువాళ్లందరికీ ఆనందకరమని ప్రముఖ కవి -ఏనుగు నరసింహారెడ్డి అన్నారు. ’తెలుగు కవులు, రచయితలు, భాషాభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్న ’తెలుగు జీవో’ ఇప్పుడు వచ్చింది ఇప్పటికి ఇది ఒక చరిత్ర. తెలంగాణ ప్రభుత్వ భాషాభిమనం లోకానికి ప్రకటితమైందని అన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com