యూట్యూబ్ మాజీ సీఈవో సుసాన్ వోజ్‌కి కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆమె భర్త డెన్నిస్ ట్రోపర్ సోషల్ మీడియాలో వెల్లడించాడు. 56 ఏళ్ల సుసాన్ వోజ్‌కి గత రెండేళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమెను అద్భుతమైన వ్యక్తిగా అభివర్ణిస్తూ, ఆమె మరణం బాధాకరం అని పేర్కొన్నారు. తొమ్మిదేళ్ల పాటు యూట్యూబ్ సీఈవోగా పనిచేసిన సుసాన్ వోజ్‌కి ఫిబ్రవరి 2023లో తన పదవికి రాజీనామా చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమె మార్కో ట్రోపర్ (19) అనుమానాస్పద స్థితిలో మరణించాడు.