ఫుడ్ పాయిజన్ కు గురై నలుగురు విద్యార్థులు మృతి చెందిన విషాద సంఘటన ఏపీలో చోటుచేసుకుంది. ఆదివారం కైలాసపట్నం అనాథ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 27 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ సోమవారం నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు విద్యార్తుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న ఆర్డీవో జయరాం ఆస్పత్రికి వెళ్లి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం పలువురు విద్యార్థులను అధికారులు కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై డిప్యూటీ డీఈవో విచారణ చేపట్టారు. విద్యార్తుల మృతిపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిగతా విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు.