Friday, December 27, 2024

గుండె పోటుతో నాలుగేళ్ల చిన్నారి మృతి

ఆగిన చిట్టి గుండె
ఖమ్మం: నాలుగేళ్ల చిన్నారి చిట్టి గుండె ఆగి పోయింది. ఆసుపత్రికి తరలిస్తుండగానే గుండె పోటుతో ప్రాణం విడిచింది. ఖమ్మం రూరల్ మండలంలోని ఎం వెంకటాయ పాలెంలో మంగళ వారం చోటు చేసుకున్న ఈ ఘటనతో గ్రామంలో విషాధ ఛాయాలు అలుముకున్నాయి. కుర్రా వినోద్, లావణ్య దంపతులకు ఒక్కగా నొక్క కూతురు హర్షిత. ఓ ప్రైవేటు పాటశాలలో నర్సరీ చదువుతోంది.

ఇంటి ఆవరణలో ఆడుకుంటూ గుండె నొప్పంటూ ఒక్క సారిగా అక్కడే కుప్పకూలి పోయింది. తల్లిదండ్రులు హుటా హుటిన హర్షితను ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. కానీ, ఆ చిన్నారి అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. హర్షిత మృతి చెందిందని వైద్యులు ధృవీకరించడంతో తల్లి దండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఒక్కగానొక్క కూతురు కళ్ల ముందే ప్రాణాలు కోల్పోవడాన్ని తట్టుకో లేక పోయారు. హర్షిత మృతితో గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com