రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు గురువారం జీవో జారీ చేసింది. రాష్ట్రంలోని 29 వేల సర్కారు బడులకు ఉచితంగా కరెంట్ సప్లయి చేయనున్నారు. వీటికి సంబంధించిన బిల్లులను ప్రభుత్వం.. డిస్కంలకు చెల్లించనున్నది. ఈ మేరకు వివరాలను జీవోలో వెల్లడించింది.