Thursday, November 7, 2024

Free Heart Surgeries To Children At NIMS నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో ఉచిత స్క్రీనింగ్ క్యాంపు

బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ప్లాస్టిక్ సర్జరీ విభాగం వారు నవంబర్ 1 నుంచి 9 వరకు ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో ఉచిత స్క్రీనింగ్ క్యాంపు నిర్వహిస్తున్నారు.

పిల్లల వైద్య ప్లాస్టిక్ శస్త్రచికిత్సలో పిల్లకు సంబంధిచి మొర్రి (క్లెఫ్ట్) మరియు క్రానియో ఫేషియల్ అసామాన్యతలు, పుట్టుకతో హస్త విపత్తులు మరియు పక్షవాతం (congenital hand and birth palsies(OBPI)), కాలిపోయిన లేదా ప్రమాదానంతరం ఏర్పడిన వైకల్యతలు, రక్తనాళ అసామాన్యతలు, మరియు 12-14 సంవత్సరాల వయస్సు లోపు పిల్లలలో ఉన్న ఇతర లోపాలను గుర్తించి ఉచిత శస్త్ర చికిత్సలు చెయ్యబడతాయి అని నిమ్స్ డైరెక్టర్ నగరి బీరప్ప గారు మరియు ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్ విభాగాధిపతి డాక్టర్ పార్వతి గారు తెలియజేశారు.

ఆరోగ్య శ్రీ మరియు సి ఎం ర్ ఎఫ్ , ఎల్ ఓ సి ద్వారా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని తెలియచేసారు. నిమ్స్ ఆవరణలోని పాత ఓపీడీ బ్లాక్ లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకొని రూమ్ నెంబర్ 8 లో డాక్టర్ గారిని సంప్రదించవలిసి ఉంటుంది.

మరిన్ని వివరాల కొరకు : 9393835845, 040-23489049

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

మూసీ ప్రాంతంలో కేసీఆర్‌కు ఇల్లు, బెడ్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకుల నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular