ఇండ్ల నిర్మాణానికి సర్కారు గుడ్ న్యూస్
ఈ నెల నుంచి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఎంపిక చేయనున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం రాష్ట్రంలో అందించే 4.50 లక్షల ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2025-26సంవత్సరంలో మొత్తం 112 క్యూబిక్ మీటర్లు ఇసుకను లబ్ధిదారులకు అందించనున్నారు. లబ్ధిదారులకు ఎలాంటి సీనరేజీ ఛార్జీలు, రవాణా భారం పడకుండా అధికారులు ఇసుకను అందించనున్నారు. ఈ మార్గదర్శకాలకు సంబంధించి ప్రభుత్వం శుక్రవారం జిల్లా కలెక్టర్లకు అంతర్గత ఉత్తర్వులను జారీ చేసింది. నాలుగు త్రైమాసికాల వారీగా జిల్లాలకు ఎంత ఇసుక అవసరమో మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఏ ప్రాతం నుంచి ఇసుకను సరఫరా చేయాలో వివరించారు.
గతేడాదికి సంబంధించి నాలుగో త్రైమాసికానికి సంబంధించి 25 లక్షల టన్నుల ఇసుక సరఫరా చేస్తున్నారు. అలాగే 2025-26లో మొదటి 3 త్రైమాసికాల్లో 25 లక్షల టన్నులు చొప్పున, నాలుగో త్రైమాసికంలో 12 వేల టన్నులు చొప్పున ఇసుకను లబ్ధిదారులకు సరఫరా చేస్తారు. హైదరాబాద్లో 13.06 లక్షల టన్నుల ఇసుక అవసరమని ప్రభుత్వ గుర్తించగా, ఈ ఇసుకను మహబూబ్‌నగర్, నల్గొండ, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల నుంచి సరఫరా చేస్తారు. మిగతా జిల్లాల్లో ఆయా ప్రాంత వనరుల నుంచి ఇసుకను అందిస్తారు. ఒక్కో ఇందిరమ్మ ఇంటికి 25 క్యూబిక్ మీటర్లు చొప్పున ఇసుకను సరఫరా చేయనున్నారు.