Saturday, May 17, 2025

ఈనెల 28వ తేదీ నుంచి వచ్చేనెల 01వ తేదీ వరకు

  • తన వద్ద ఉన్న శాఖల హెచ్‌ఓడిలతో సిఎం రేవంత్ సమీక్ష
  • ఆయా శాఖల పరిధిలోని పథకాల వ్యయం
  • ప్రతిపాదనల పద్దుల సమావేశం

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జూన్ 28వ తేదీ నుంచి జూలై 1వ తేదీ వరకు తన వద్ద ఉన్న శాఖలపై సమావేశాలు నిర్వహించనున్నారు. 2024,-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో భాగంగా ఆయాశాఖల పరిధిలోని పథకాల వ్యయ ప్రతిపాదనలను క్షుణ్ణంగా సమీక్షించాలని ఆర్థికశాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఆయా శాఖల హెచ్‌ఓడిలతో సిఎం రేవంత్ సమీక్ష జరుపనున్నారు. ఆయా శాఖల పరిధిలోని పథకాల వ్యయానికి సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించి పద్దులను సిద్ధం చేయనున్నారు. ఇటీవల ప్రభుత్వ ప్రకటనలను దృష్టిలో ఉంచుకొని కొత్త పథకాలకయ్యే ఖర్చు వివరాలను ప్రత్యేకంగా రూపొందించాలని ఆర్థికశాఖ స్పష్టం చేసింది. జూలై నెలాఖరులోగా పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ ఉభయసభల ఆమోదం పొందాల్సి ఉంది. ఇందుకోసం వచ్చేనెల మొదటివారంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది.

ఆ మేరకు రాష్ట్రఆర్థికశాఖ పద్దు కసరత్తు ప్రారంభించింది. పూర్తిస్థాయి బడ్జెట్ రూపకల్పనలో భాగంగా అన్ని శాఖల నుంచి ఇప్పటికే ఆర్థికశాఖ ప్రతిపాదనలను కోరింది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి సంబంధించి ఆయా శాఖల పనితీరు నిర్ధేశించిన లక్ష్యాల వివరాలను ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆయా శాఖల మంత్రులు హెచ్‌ఓడిలతో సమావేశం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే సిఎం కూడా తన వద్ద నున్న శాఖల అధికారులు సమీక్ష చేయనున్నారు.

ఈనెల 18వ తేదీ నుంచి శాఖల వారీగా మంత్రుల సన్నాహక భేటీలు
ఈనెల 18వ తేదీ నుంచి శాఖల వారీగా మంత్రులు సన్నాహక భేటీలు నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆయా శాఖల కార్యదర్శులు, హెచ్‌ఓడిలు కూడా హాజరుకానున్నారు. ఈనెల18వ తేదీన వ్యవసాయ, చేనేతశాఖల ప్రతిపాదనలపై చర్చించనున్నారు. జూన్ 21వ తేదీన రెవెన్యూ, గృహనిర్మాణం, ఐఅండ్ పిఆర్, పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమం, వైద్య-ఆరోగ్య శాఖలతో సమావేశం నిర్వహించనున్నారు. జూన్ 22వ తేదీన సినిమాటోగ్రఫీ, ఐటీ, ఆర్ అండ్ బి, పరిశ్రమల శాఖ పై చర్చ జరుగనుంది. జూన్ 26వ తేదీన నీటిపారుదల, పౌరసరఫరాలు, అటవీ, దేవాదాయశాఖలపై సమావేశం నిర్వహించనున్నారు. జూన్ 27వ తేదీన రవాణా, బిసి సంక్షేమం, ఎక్సైజ్, పర్యాటకశాఖల ప్రతిపాదనలపై చర్చించనున్నట్టుగా సమాచారం.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com