విమానయాన సంస్థలు టికెట్ ధరలను మార్చడానికి నెల రోజుల ముందుగానే తమకు సమాచారం ఇవ్వాలని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది.రాజ్యసభలో విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు.
‘ధరల నియంత్రణకు కొత్త చర్యలు తీసుకుంటున్నాం. ఎయిర్లైన్స్ తమ టికెట్ ధరలు 24 గంటల్లోనే మార్చుకునేందుకు వీలు కల్పించే 2010 నిబంధనను తొలగిస్తున్నాం. ఎయిర్లైన్స్ ఇష్టారాజ్యంగా ధరలు మార్చడానికి వీల్లేదు’ అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.