Wednesday, March 19, 2025

ఫ్యూచర్ సిటీ క్లారిటీ

రాష్ట్రానికే కాదు, దేశానికే తలమానికంగా నిలిచే నెట్-జీరో ఫ్యూచర్ సిటీపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ రహదారుల మధ్య 56 గ్రామాల్లో, 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ మెగా అర్బన్ ప్రాజెక్ట్ పర్యవేక్షణకు ఎఫ్‌సీడీఏ (ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ) ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఈ సిటీలో మల్టీమోడల్ కనెక్టివిటీ, ఎలక్ట్రిక్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్, గ్రీన్ బిల్డింగ్స్ లాంటి ఆధునిక సౌకర్యాలు ఉంటాయని చెప్పారు. ఏఐ సిటీ, ఫార్మా హబ్, స్పోర్ట్స్ సిటీ, క్లీన్ ఎనర్జీ ఇన్నోవేషన్ జోన్ లాంటివి ఫ్యూచర్ సిటీలో ఉంటాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. బల్దియా, హెచ్​ఎండీఏ తరహాలో ఫ్యూచర్​సిటీ అభివృద్ధి కోసం ఫ్యూచర్ ​సిటీ డెవలప్​మెంట్​అథారిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ఎఫ్సీడీఏ పరిధిలోకి ఇప్పటికే హెచ్ఎండీఏలోని 56 రెవెన్యూ గ్రామాలను కలపగా, ఔటర్​రింగ్​రోడ్​అవతల, శ్రీశైలం జాతీయ రహదారి, నాగార్జున సాగర్​స్టేట్​హైవేల పరిధిలోని పలు ప్రాంతాలను కూడా తీసుకువచ్చారు. అలాగే రాజీవ్​గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్​పోర్ట్​పరిధిలోని శంషాబాద్​, దాని పరిసర ప్రాంతాలు కూడా వచ్చి చేరాయి. ఈ ప్రాంతంలోనే తెలంగాణ ఇండస్ట్రియల్​ఇన్​ఫ్రాస్ర్టక్చర్​(టీజీఐఐసీ) ఆధ్వర్యంలో ఎకనామిక్​ జోన్​, ఇండస్ట్రియల్ క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com